calender_icon.png 16 January, 2025 | 10:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రీడా మధ్యవర్తిత్వం తీర్పుతో వినేశ్ కు న్యాయం జరిగేనా ?

09-08-2024 05:49:12 PM

వినేష్ ఫోగట్ పై అనర్హత విషయంపై అటు న్యాయ నిపుణులు ,క్రీడా పండితులలో అనేక చర్చోప చర్చలకు దారితీస్తోంది. డబ్ల్యూ ఎఫ్ ఐ, ఐవోసీ మధ్య వర్తిత్వ చట్టం వర్తింప జేయవచ్చా లేదా అని చర్చిస్తున్నారు. ఒకే రాత్రి జరిగిన నాటకీయ పరిణామాలతో బరువు తగ్గడాన్ని క్రీడా  ఆర్బిట్రేషన్ పరిధిలోకి విచారణ జరిపి అనర్హత నిర్ణయాన్ని సమీక్షిస్తే వినేష్ కు కనీసం రజితం అయినా దక్కే అవకాశం ఉంటుందని భారత క్రీడాభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తు న్నారు. కాగా ఆమెతో ఫైనల్ లో తలపడాల్సిన ప్రత్యర్థి సారా హెల్డ్ బ్రాంట్ సైతం వినేశ్ పరిస్థితి విచిత్ర మైనదని ఇలాంటి పరిస్థితిలో ముందేమో ఏదో ఒక ఒలింపిక్ పతకం ఖాయంగా  గెలిచావబోతుందని.. తరువాత అలాంటిదేం లేదు అంటే ఎవరైనా మానసిక ఒత్తిడికి గురవుతారు అంది. కాగా వినేశ్ పై  కోర్ట్  ఆఫ్  ఆర్బి ట్రేషన్ ఫర్ స్పోర్ట్ తీర్పు శుక్రవారం వెలువడే అవకాశం ఉందంటున్నారు.