- ఫైనల్ దూసుకెళ్లిన భారత స్టార్ రెజ్లర్
- సెమీస్‌లో లోపేజ్‌పై 5 విజయం
పారిస్: భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ తన పట్టును చూపించింది. ప్రతిష్ఠాత్మక పారిస్ క్రీడల్లో మహిళల 50 కేజీల ఫ్రీ స్టుల్ విభాగంలో వినేశ్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన సెమీఫైనల్లో ఫొగాట్ 5 తేడాతో క్యూబా రెజ్లర్ గుజ్‌మన్ లోపేజ్‌పై విజయాన్ని సాధించి తొలిసారి ఫైనల్లో అడుగుపెట్టింది. గతంలో రెండుసార్లు ఒలింపిక్స్‌లో పాల్గొనప్పటికీ రిక్త హస్తాలతో తిరిగొచ్చిన వినేశ్ ఈసారి మాత్రం ఏకంగా స్వర్ణంపై గురి పెట్టింది.
బుధవారం అర్థరాత్రి దాటిన తర్వాత 50 కేజీల ఫ్రీస్టుల్ ఫైనల్ జరగనుంది. అంతకముందు క్వార్టర్ ఫైనల్ పోరులో వినేశ్ 7 ఉక్రెయిన్ రెజ్లర్ లివచ్ ఒక్సానాను ఓడించింది. ఈ పోరులో అయితే ఫొగాట్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. ఆరంభంలోనే 4 లీడ్‌లోకి వెళ్లింది. కానీ తన పట్టు విడవని ఫొగాట్ ప్రత్యర్థిని ముప్పతిప్పలు పెట్టి మ్యాచ్ గెలుచుకుంది.
చాంపియన్‌కు షాక్..
బై ద్వారా ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టిన వినేశ్‌కు డిఫెండింగ్ చాంపియన్ సుసాకి (జపాన్) రూపంలో కఠిన ప్రత్యర్థి ఎదురైంది. పేరుకు తగ్గట్లే ఆట ఆరంభంలో ఫొగాట్ మీద సుసాకి ఆధిపత్యం చెలాయించింది. కానీ తర్వాత ఫుంజుకున్న ఫొగాట్ 3 సుసాకిని ఓడించి చిరస్మరణీయ విజయం అందుకుంది. టోక్యో ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించి డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన సుసాకి ఈ ఓటమితో కొంతసేపు షాక్‌లో ఉండిపోగా.. వినేశ్ కూడా గెలిచిన ఆనందంలో కన్నీటిపర్యంతమైంది.