calender_icon.png 19 November, 2024 | 10:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వినేశ్.. వీర పుత్రిక

17-08-2024 12:00:00 AM

ఎక్స్ వేదికగా వీడియో పంచుకున్న ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: పారిస్ ఒలింపిక్స్‌లో అనర్హత వేటుకు గురైన భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌ను ప్రధాని నరేంద్ర మోదీ కొని యాడారు. వినేశ్ ‘వీర పుత్రిక’ అని ప్రధాని అభివర్ణించారు. స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకొని మోదీ అథ్లెట్ల బృందంతో భేటీ అయిన మీటింగ్ హైలైట్స్‌ను వీడియో రూపంలో ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నారు. ‘మిమ్మల్ని చూస్తే చాలా గర్వంగా ఉంది. రిక్త హస్తాలతో తిరిగొచ్చిన అథ్లెట్లు ఆ బాధను మరిచిపోండి. మీ ప్రదర్శన అద్భుతంగా కొనసాగింది. పారిస్ ఒలింపిక్స్ మీకొక లాంచింగ్ పాడ్. ఇక నుంచి అంతా గెలుపే. మీరంతా 2036 ఒలింపిక్స్ భారత సైన్యం. మీరంతా నిజమైన హీరోలు’ అని పేర్కొన్నారు.

యువ రెజ్లర్ రితికా హుడా పతకం తేలేదని బాధపడింది. ‘అధైర్యపడొద్దు.. సాధించాల్సింది చాలా ఉంది’ అని మోదీ అన్నారు. ‘మ్యాచ్‌ల సమయంలో కోచ్ ప్రకాశ్ నా వద్ద ఫోన్ లేకుండా చూశారు. పతకానికి చేరువగా వచ్చి కోల్పోవడం బాధ కలిగించింది. వచ్చేసారి తప్పకుండా పతకం సాధిస్తా’ అని లక్ష్యసేన్ పేర్కొన్నాడు. అయితే వచ్చే ఒలింపిక్స్‌లోనూ మీ వెంట ప్రకాశ్‌ను పంపిస్తామని మోదీ పేర్కొనడంతో ఒక్కసారిగా నవ్వులు విరపూశాయి. హాకీ సీనియర్ ప్లేయర్ శ్రీజేశ్‌కు గుర్తుండిపోయేలా ఫేర్‌వెల్ ఇచ్చారంటూ భారత హాకీ జట్టును మోదీ ప్రశంసించారు.