పారిస్: భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్ అనర్హత వేటుకు సంబంధించిన కేసు తీర్పును కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (కాస్) మరోసారి వాయిదా వేసింది. పారిస్ ఒలింపిక్స్‌లో కేవలం వంద గ్రాముల అధిక బరువు కారణంగా అనర్హతకు గురైన వినేశ్ తనకు రజత పతకం ఇవ్వాలంటూ కాస్‌కు అప్పీల్ చేసుకుంది. తాజాగా మంగళవారం మరోసారి వాదనలు విన్న కాస్ తీర్పును ఈ నెల 16కు వాయిదా వేసింది. వినేశ్ వ్యవహారం లో కాస్ తీర్పు వాయిదా వేయడం ఇది మూడోసారి. తీర్పు వెలువడనున్న నేపథ్యం లో వినేశ్ ఇంకా స్వదేశానికి చేరుకోలేదు. సోమవారం వినేశ్ తన లగేజీతో ఒలింపిక్ విలేజ్ నుంచి బయటికి వచ్చేసింది.