05-04-2025 08:26:43 PM
హుజూరాబాద్,విజయ క్రాంతి: ఈ నెల 7 నుంచి 14 వరకు ఒడిశా భువనేశ్వర్ లో జరిగబోయే 73వ ఆలిండియా హాకీ పోలీస్ మీట్ కు హుజూరాబాద్ కు చెందిన మోటపోతుల వినీత్ ఎంపికయ్యారు. వినీత్ హైదరాబాద్ లోని అంబర్ పేటలో సిటీ పోలీస్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు. వినీత్ ఎంపిక పట్ల హుజూరాబాద్ హాకీ క్లబ్ శాశ్వత అధ్యక్షుడు తోట రాజేంద్రప్రసాద్, జిల్లా హాకీ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ బండ శ్రీనివాస్, హుజూరాబాద్ హాకీ క్లబ్ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ శంకర్ ,సెక్రటరీ ఉమామహేశ్వర్ , సభ్యులు సజ్జు, యూసుఫ్, రమేష్, తిరుపతి, శ్యాంసుందర్, రవికుమార్, రాజేష్, ప్రదీప్, సాయి క్రిష్ణ , విక్రమ్, సాంబ, వినయ్, సన్ని, విపుల్, తదితరులు హర్షం వ్యక్తం చేశారు.