calender_icon.png 23 December, 2024 | 6:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాదాపూర్ మైహోమ్ పూజ లడ్డూను కైవసం చేసుకున్న ఇల్లందు వాసి

16-09-2024 07:48:14 PM

ఇల్లందు,(విజయక్రాంతి): మాదాపూర్ లోని మైహోమ్ భుజలో వినాయకుడి లడ్డు రికార్డు ధర పలికింది. సోమవారం జరిగిన వేలంపాటలో గణనాథుడి లడ్డు 29 లక్షలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందుకు చెందిన కొండపల్లి గణేష్ దక్కించుకున్నారు. గ్రేటెడ్ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద తొమ్మిది రోజులపాటు గణనాథుడికి పూజలు నిర్వహించి చివరి రోజు జరిపిన లడ్డు వేలం పాట హోరాహోరీగా సాగింది. హైదరాబాద్ చరిత్రలో మై హోమ్ భుజ లడ్డు  అత్యంత భారీ ధర పలకటం ఇదే మొదటిసారి. వేలంపాటలో గణనాథుడు లడ్డును దక్కించుకున్న గణేష్ ను ఆయన సన్నిహితులు శ్రేయోభిలాషులు అభినందించారు.