మందమర్రి,(విజయక్రాంతి): మందమర్రి మండలం కేతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఆర్ఆర్ నగర్ కాలనీలో ఆర్ఆర్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ గణేష్ మండలి కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేశుని వద్ద ఆదివారం లడ్డు, కలశానికి వేలం పాట నిర్వహించారు. లడ్డు రూ. 45,100, కలశం రూ. 27 వేలకు మండల లలిత - రాజిరెడ్డి దంపతులు కైవసం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు