ప్రకటించిన డీజీపీ జితేందర్
పోలీసు సిబ్బందికి అభినందన
హైదరాబాద్, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): రాష్ట్రంలో వినాయక నిమజ్జనం ప్రశాంతంగా ముగిసిందని, 1,36,638 విగ్రహాలను, 5,879 పాయింట్ల వద్ద నిమజ్జనం చేసినట్టు డీజీపీ జితేందర్ తెలిపారు. మంగళవారం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్ మూడు కమిషనరేట్ల పరిధిలో గణేశ్ నిమజ్జనంతోపాటు మిలాద్ ఉన్ నబీ ప్రశాంతంగా పూర్తిచేసినందుకు పోలీసు సిబ్బందిని అభినందించారు.
బందోబస్తు కోసం 15,400 మంది పోలీసులను జిల్లాల నుంచి తీసుకొచ్చినట్టు చెప్పా రు. 12 వేల మంది ఎస్సైలు, కానిస్టేబుల్ ట్రైనీలు ఉన్నట్టు తెలిపారు. హైదరాబాద్ సహా రాష్ట్రంలో 300 ప్రాంతాల్లో శోభయాత్రలు జరిగాయని వెల్లడించారు. డీజేల శబ్దకాలుష్యం చాలామందిని ఇబ్బంది పెట్టిందని, డీజేల నిర్వహణపై త్వరలోనే మార్గద ర్శకాలు రూపొందిస్తామని చెప్పారు.
ఫోన్ ట్యాపింగ్ కేసు స్పందిస్తూ ప్రత్యేక బృందాల తో విచారణ జరుగుతోందన్నారు. నిందితులకు ఇప్పటికే ఇంటర్‌పోల్ ద్వారా రెడ్ కార్న ర్ నోటీసులు జారీ చేయించామని తెలిపా రు. కోర్టు పరిధిలో ఈ అంశం ఉండటంతో ఎక్కువ వివరాలు ప్రకటించలేదన్నారు.
ఇక జైనూర్ ఘటనపై మాట్లాడుతూ లైంగిక దాడి గురించి బయటకి వచ్చిన అనంతరం జరిగిన అల్లర్ల ఘటనలో ఇప్పటికే 39 మం దిని అరెస్టు చేసినట్లు, అల్లర్లు అదుపు చేయ ని కారణంగా డీఎస్పీని విధుల నుంచి తప్పించినట్లు వెల్లడించారు.
జోగులాంబదేవి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం
రాష్ట్రంలోని శక్తిపీఠం అలంపూర్ జోగులాంబ బాల బ్రహ్మేశ్వరస్వామి ఆలయంలో అక్టోబర్ 3 నుంచి 12 వరకు జరిగే దేవీ శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాలకు రావాలని డీజీపీ జితేందర్‌ను దేవ స్థానం ప్రతినిధులు ఆహ్వానించారు.
ఈ మేరకు మంగళవారం ఆలయ ఈవో పురేందర్‌కుమార్, ప్రధాన అర్చకుడు బ్రహ్మశ్రీ దిండిగల్ ఆనంద్‌శర్మ.. డీజీపీ జితేందర్, అడిషనల్ డీజీపీ మహేశ్‌భగవత్, ఐజీపీ ఎం రమేశ్‌లను కలిసి బ్రహ్మో త్సవాల ఆహ్వాన పత్రికను అందించారు. దీంతోపాటు దేవస్థానం ప్రసాదంతోపాటుగా అమ్మవారి శేష వస్త్రాలను అందజే సి వేద ఆశీర్వచనం చేశారు.