హైదరాబాద్,(విజయక్రాంతి): నగరంలో ప్రశాంతంగా వినాయక నిమజ్జనాలు జరుగుతున్నాయని సీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. గతేడాది మాదిరి నిమజ్జనాలు ఆలస్యం కాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. బాలాపూర్ గణేశుడిని కూడా త్వరగా నిమజ్జనం చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. వినాయక నిమజ్జనంలో భాగం నగరంలో ట్రాఫిక్ సమస్యలు లేకుండా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సీపీ ఆనంద్ తెలిపారు. షిప్ట్ ల వారీగా 25 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామని, ఇంకా 20, 30 వేల విగ్రహాల నిమజ్జనం పెండింగ్ లో ఉండొచ్చని, అయి కూడా రేపు ఉదయంలోపు నిమజ్జనం పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని సీపీ చెప్పారు. నిమజ్జనానికి వచ్చే భక్తులు ప్రజారవాణాను వినియోగించుకోవాలని సూచించారు.