మంచిర్యాల,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా కోల్ బెల్ట్ ప్రాంతంలో గణేషుడి నిమజ్జన వేడుకలు సోమ వారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. వినాయకులను భాజాభజంత్రీల మధ్య ఊరేగింపుగా సమీప గోదావరి నదికి తీసుకువెళ్లి నిమజ్జనం చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. నిమజ్జన పాయింట్ల వద్ద వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేశారు. మంచిర్యాల పట్టణంతోపాటు మరికొన్ని పట్టణాలలో మంగళవారం నిమజ్జన వేడుకలు నిర్వహించనున్నారు.