17-03-2025 12:52:03 AM
రాజేంద్రనగర్, మార్చి 16 (విజయక్రాంతి): బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ ఆల్ కాలనీస్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా విన య్‌రెడ్డిని ఎన్నుకున్నారు. వెస్టెండ్ కాలనీ కమ్యూనిటీ హాల్ లో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ప్రస్తుత కార్యనిర్వాహక సభ్యులు నూతన ప్రెసిడెంట్ గా పి. వినయ్ రెడ్డిని, ముఖ్య సలహాదారునిగా ఎం. సుధాకర్‌ని ఎన్నుకున్నారు.
ఏసీఎఫ్ జనరల్ సెక్రటరీగా నరేంద్ర బాబు కొనసాగుతారని పేర్కొన్నారు. ఏసీఎఫ్ కార్యనిర్వాహక కమిటీ విస్తరణ కు నిర్వహించిన ఈ సమావేశంలో బండ్లగూడ జాగీర్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని అన్ని కాలనీల ప్రతినిధులు పాల్గొని సభ్యత్వం తీసుకున్నారు. సుమారు ౬౦ కాలనీల ప్రతినిధుల పాల్గొన్నారు. బీజేఎంసీ సమస్యల పరిష్కారం కోసం అంద రం కలిసి పనిచేయాలని నిర్ణయించారు.