calender_icon.png 24 December, 2024 | 5:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పార్టీ కార్యకర్తలు, ప్రజలను కలవనివ్వరా

13-09-2024 12:29:01 PM

పోలీసుల నిర్బంధంలో దాస్యం వినయ్ భాస్కర్ 

హనుమకొండ: పార్టీ ఫిరాయింపులు, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై దాడి, మాజీ మంత్రులు అరెస్టులు, నిర్బంధాలు, వారి పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుకు నిరసనగా... బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతున్న క్రమంలో దాస్యం వినయ్ భాస్కర్ గారిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వినయ్ భాస్కర్ మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలు, ప్రజలను కలవనివ్వరా అని పోలీసులను ప్రశ్నించారు. పార్టీ కార్యాలయంలోకి వచ్చేవారి వివరాలు ఎందుకు తీసుకుంటున్నారని, పార్టీ కార్యాలయం గేట్లను ఎందుకు మూసివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమని అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. అనంతరం హైదరాబాద్ వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కొద్ది సేపు పోలీసులకు, పార్టీ శ్రేణులకు వాగ్వాదం జరిగింది.