calender_icon.png 25 October, 2024 | 5:45 AM

విలన్‌తో.. విమల ప్రేమాయణం

07-07-2024 12:05:00 AM

విమలా రామన్.. అందం, అభినయానికేం తక్కువ కాదు. కానీ, టాలీవుడ్‌లో పదికి పైగా సినిమాల్లో హీరోయిన్‌గా నటించినప్పటికీ పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయింది. నలభై రెండేళ్ల వయసులో మళ్లీ జోరు పెంచింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో దూసుకుపోతోంది. వ్యక్తిగత జీవితంలోనూ దూకుడుగా వ్యవహరిస్తున్నట్టు అంతా చెప్పకుంటున్నారు. ఓ విలన్‌తో డేటింగ్ చేస్తుందన్న వార్తలు వినవస్తున్నాయి. టాలీవుడ్, కోలీవుడ్‌లో ప్రతినాయకుడిగా పాత్రల్లో ఆకట్టుకుంటున్న వినయ్ రాయ్‌తో ఈ బ్యూటీ డేటింగ్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతుండగా, ఈ గాసిప్స్‌నకు బలం చేకూరుస్తున్నామన్నట్టుగా ఈ జంట వ్యవహరిస్తోంది. విమల తన సోషల్ మీడియా ఖాతాల్లో ఈ జంట బోల్డ్ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తోంది.

‘వీవీ’ (విమల పేరుతో ప్రత్యేక ఫొటోషూట్ సిరీస్ నుంచి కూడా ఫొటోలను షేర్ చేశారు. ఈ ఫొటోల్లో ఇద్దరి మధ్య ఎమోషన్ చూస్తున్న నెటిజన్స్ డేటింగ్ కారణం అని కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ఓ స్విమ్మింగ్ పూల్ వద్ద ఇద్దరూ బోల్డ్‌గా హత్తుకుపోయి ఫొటోలకు ఫోజులిచ్చిన దాన్ని బట్టి చూస్తే మాత్రం డేటింగ్ వార్తకు మీరూ బలం చేకూర్చకుండా ఉండలేరేమో! డేటింగ్ ముచ్చట కాస్త పక్కన పెట్టి వీరి సినిమాల విషయానికొస్తే.. విమలా రామన్ 2009లో ‘ఎవరైనా ఎపుడైనా’ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది.

తర్వాత ‘గాయం ‘చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి’ వంటి చిత్రాల్లోనూ నటించింది. ఇక వినయ్ రాయ్ ‘వాన’ సినిమాతో హీరోగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. రీసెంట్‌గా ‘హను ‘గాండీవధారి అర్జున’, ‘ఈగల్’ వంటి సినిమాల్లో ప్రతినాయకుడిగా నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘గాండీవధారి అర్జున’లో విమలా రామన్ రాయ్ పెళ్లయిన జంటగా కనిపించారు. అప్పట్నుంచే వారి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ, ఆఫ్ ది స్క్రీన్ కెమిస్ట్రీ మ్యాచ్ అయ్యాయని, అదే వారి డేటింగ్‌కు దారి తీసిందన్నది తాజా కబురు.