calender_icon.png 29 September, 2024 | 1:04 AM

విలన్స్ వేట్టయన్.. ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్!

26-09-2024 12:46:01 AM

సూపర్‌స్టార్ రజినీకాంత్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘వేట్టయన్-: ద హంటర్’ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ ఈ సినిమాను నిర్మించారు. దసరా సందర్భంగా అక్టోబర్ 10న తమిళ, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రివ్యూ పేరుతో చిత్రబృందం ఓ ప్రత్యేక వీడియోను బుధవారం విడుదల చేసింది.

ప్రివ్యూను పరిశీలిస్తే.. ‘ఈ దేశంలో లక్షలాది మంది పోలీసులున్నారు.. కానీ వీళ్లను మాత్రం చూడగానే గుర్తుపడుతున్నారంటే, అదె లా సాధ్యం!’ అని సత్యదేవ్ (అమితాబ్ బచ్చన్) అడగడం.. ట్రైనింగ్ తీసుకుంటున్న ఓ లేడీ ఆఫీసర్ ‘మోస్ట్ డేంజరస్ క్రిమినల్స్‌ను ఎన్‌కౌంటర్స్ చేయటం వల్ల వీళ్లు హీరోస్ అయ్యారు’ అని సమాధానం చెప్పడం కనిపిస్తుంది.

అంటే ప్రజలను పీడించే రౌడీలను ‘విలన్స్ వేట్టయన్’ (రజినీకాంత్) వేటాడుతుంటాడనేది ప్రివ్యూ ద్వారా తెలుస్తోంది. వేట్టయన్ పేరు చెబితేనే ‘మనకు ఎస్పీ అనే పేరు మీద ఒక యముడొచ్చి దిగినాడు’ అంటూ నేరస్తులు హడలిపోయే సీన్స్ రివీల్ చేశారు. ఇక ఫహాద్ ఫాజిల్, దుసారా విజయన్, రానా, అభిరామి, మంజు వారియర్ పాత్రల నూ  పరిచయం చేశారు.