calender_icon.png 4 January, 2025 | 2:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంథని మండలంలో విలీనం కానున్న గ్రామాలు...!

01-01-2025 09:01:47 PM

మంథని (విజయక్రాంతి): మంథని మండలంలోకి ఖమ్మంపల్లి, సీతంపేట, ఇప్పలపల్లి గ్రామాలు విలీనం కానున్నాయి. ఇటీవల మంథని మండలంలోని కొన్ని గ్రామాలను కలుపుతూ గుంజపడుగు మండలాన్ని ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తుండడంతో పాటు నాగారం కన్నాల గ్రామాలను గుంజపాడు మండలంలో కలుపుతుండడంతో మంథని మండలంలోకి జనాభా ప్రాతిపదికన మరి కొన్ని ఊళ్లను కలిపేందుకు ముత్తారం మండల పరిధిలోని మంథని పట్టణానికి పది కిలోమీటర్ల సమీపంలో ఉన్న ఖమ్మంపల్లి, జిల్లలపల్లి, సీతంపేట, ఇప్పలపల్లి గ్రామాలను కలపాలని అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది.