- గ్రామాల్లో పడకేసిన పారిశుద్ధ్యం
- గతంలో చేసిన పనులకే నిధులు రాలె
- తలపట్టుకుంటున్న గ్రామ కార్యదర్శులు
కామారెడ్డి,ఆగస్టు 26(విజయక్రాంతి): గ్రామాల్లో అభివృద్ధి పనులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. ఇటీవలే జీపీల పాలకవర్గాల పద వీకాలం ముగిసింది. దీంతో పంచాయతీ కా ర్యదర్శులే గ్రామాలకు దిక్కయ్యారు. నిధులు లేకపోవడంతో గ్రామా ల్లో పనులు చేయించానికి వెనుకడుగు వేస్తున్నారు. దీంతో పారిశుధ్యపనులు చేయకపోవడంతో గ్రామాల్లో ఎక్కడ చూసి నా చెత్త, చెదారం పేరుకుపోయి కంపు కొడుతున్నాయి. పను లు చేయించడానికి ప్రభుత్వం నుంచి ఎప్పు డు నిధులు వస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది.
చేతులెత్తేస్తున్న అధికారులు
అప్పులు తెచ్చి పారిశుధ్య పనులు చేయి ంచి అవస్థలు పడేకంటే ప్రస్తుతం ఉన్న పారిశుధ్య కార్మికులతోనే అరకొరగా పనులు చే యిస్తున్నారు. నిధులు లేక గ్రామాల్లో పారిశుధ్యం లోపించి ప్రజలు తీవ్ర జ్వరాల బారి న పడుతున్నారు. నిధులు లేకపోవడంతో పారిశుధ్యంపై చేతులెత్తేస్తున్నారు. చిన్న పం చాయతీల్లో వసూలయ్యే పన్ను లు ట్రాక్టర్ కి స్తీలకే సరిపోవడం లేదని వాపోతున్నారు. విద్యుత్ బకాయిలు, మరమ్మతులు, క్లోరి నేషన్ తదితర అవసరాలకు నిధులు లేకపోవడంతో గ్రా మాల్లో పారిశుధ్యం అస్తవ్యస్థంగా మారింది.
కేంద్ర ప్రభు త్వం ఇటీవల పంచాయతీలకు ని ధులు విడుదల చేసినప్పటికీ ఖాతాల్లో జమ కాలేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా గతేడాది ఫిబ్రవరి నుంచి నిధులను జమచే యడం లేదు. ప్రస్తుతం సీజనల్ వ్యాధులతో ప్రజలు రోగాల బారిన పడుతున్నప్పటి కీ కనీసం క్లోరినేషన్, పారిశుధ్యంపై దృష్టి సా రించలేక పోతున్నాయి. జిల్లాలో 526 పం చాయితీలు ఉండగా 526 మంది పంచాయి తీ కార్యదర్శులకు అదనంగా బీఎల్‌వో బా ధ్యతలను అప్పగించడం మరింత భారంగా మారింది. జిల్లాలో 8కి పైగా పంచాయితీ కార్యదర్శుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
అధికారులు ఆపసోపాలు..
ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోవడంతో పంచాయతీ కార్యదర్శులు, అధి కారులు అపసోపాలు పడుతున్నారు. కొంద రు కార్యదర్శులు సొంత నిధులు వ్యయం చేస్తున్నప్పటికీ పూర్తిస్థాయిలో పనులు చేపట్టలేక ఇబ్బంది పడుతున్నారు. చిన్న పంచా యతీలకు ఎలాంటి అదాయ మార్గాలు లేక పారిశుధ్య కార్మికులకు వేతనాలు చెల్లించడం లేదు. కామారెడ్డి మండలంలోని క్యాసంపల్లి రైట్ తండా గ్రామపంచాయతీ జనాభా 55 0 ఉండగా కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రతి నెలా రూ.27 వేలు జమవుతుండేవి.
ఇందులో రూ.12,500 ట్రాక్టర్ కిస్తీకి, పది వేలు కరెంట్ బిల్లు, పంచాయితీ కార్మికుడికి రూ.9500 చెల్లించేవారు. నిధులు సరిపోకపోయినా సర్పంచులు తమ పదవీ కాలంలో ఎలాగోలా నెట్టుకువచ్చారు. ఇటీవల వారి పదవీకాలం ముగియడంతో ఆరు నెలలుగా ఎక్కడిపనులు అక్కడే నిలిచిపోయాయి. చేసి న పనులకు జిల్లాలో దాదాపు రూ. మూడున్నర కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.
బ్యాంకు నోటీసులు..
ప్రతి పంచాయతీకి ట్రాక్టర్‌తో పాటు ట్యాంకర్, ఇతర పనిముట్లు కొనుగోలు చేశా రు. ఆదాయం లేకపోవడంతో ట్రాక్టర్లకు బ్యా ంకు కిస్తీలు చెల్లించలేక పోతున్నాయి. డీజిల్ కు డబ్బులు లేకపోవడంతో ట్రాక్టర్లను మూ లన పడేశారు. పారిశుధ్య కార్మికుడి బైక్‌పై చెత్తను తరలిస్తున్నారు. గతేడాది నుంచి కిస్తీలు చెల్లించకపోవడంతో బ్యాంకులు నోటీసులు జారీ చేస్తున్నాయి.
స్పెషల్ గ్రాంట్ నిధులను ఖర్చు పెట్టాలి
కామారెడ్డి జిల్లాలో 534 గ్రామ పంచాయతీలకు గాను 526 జీపీలకు గ్రామ కార్యదర్శులు విధులు నిర్వహిస్తున్నారు.ప్రత్యేక గ్రాంట్ నిధులను ఖర్చుపెట్టి పారిశుధ్యం, క్లోరినేషన్, ఫాగింగ్, దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని కార్యదర్శులను ఆదేశించాం. ప్రభుత్వం నుంచి నిధులు రాగానే పంచాయతీలకు నిధులు పంపిణీ చేయడం జరుగుతుంది.పారిశుధ్య కార్మికులు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని సూచించాం. త్వరలో నిధులు వస్తాయి.
శ్రీనివాస్‌రావు, జిల్లా పంచాయతీ
అధికారి, కామారెడ్డి