13-03-2025 12:43:40 AM
ఆదిలాబాద్, మార్చి 12 (విజయక్రాంతి): వేసవి కాలం వచ్చిందంటే చాలు ఆదిలాబాద్ జిల్లాలోని పలు పల్లెలు గొంతెండు తున్నాయి. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు గడిచిన ఇప్పటికీ జిల్లాలోని పలు మారుమూల గ్రామాల్లో తాగడానికి గుక్కెడు నీరు దొరకడం లేదంటే అతిశయోక్తి కాదు. నీటి కట కటతో ఎన్నో గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ప్రతి ఏడు వేసవి కాలంలో మంచి నీటి కోసం ప్రజలు పడరాని పాట్లు పడుతుండగా.. ఈ ఏడాది మాత్రం వేసవికాలం ఆరంభంలోనే పలు గ్రామాల్లో నీటి కష్టాలు మొదలయ్యాయి. బిందెడు నీటి కోసం కోసుల మైళ్ళు కాలినడకన వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.
జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లోనైతే దుర్భర పరిస్థితి నెలకొంది. ఇక మంచినీటి సమస్య పరిష్కారానికై ప్రారంభించిన మిషన్ భగీరథ పథకం పనితీరు చెప్పా ల్సిన అవసరం లేదు. వేసవి కాలం ఆరంభంలోనే గర్భజలాలు అడుగంటడంతో గ్రామా ల్లో నీటి కటకట ఏర్పడుతుంది.
గొంతెండుతున్న ఏజెన్సీ గ్రామాలు..
ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ గ్రామా ల్లో మంచినీటి సరఫరా లేక వేసవి కాలం వచ్చిందంటే ఇంద్రవెల్లి, ఉట్నూర్, నార్నూ ర్, గాది గూడ, సిరికొండ, ఆదిలాబాద్ రూరల్, తలమడుగు, బేలా మండలంలోని సాలెగూడ, లింగు గూడ, లోహార, దార్లోద్ధి, మొలల గుట్ట, అసోద, బుర్కి, మలే బోరుగామ, ఖానాపూర్ ఖండా ల, గొండి గూడ, షేక్ గూడ, దుబ్బగూడా, కొగ్దూర్, రత్నాపూర్, పల్సి(బి), తాండ, కోసా యి తదితర గ్రామాల్లో నేటికీ నీటి కష్టాలు కొనసాగుతున్నాయి.
పలు గ్రామాల్లో మిష న్ భగీరథ పైప్ లైన్ వచ్చినప్పటికీ చాలమేర గ్రామాల్లో నీటి సరఫరా కావడం లేదు. మరికొన్ని గ్రామాల్లో నీటి సరఫరా అవుతున్నప్పటికీ గ్రామాల ప్రజలు మిషన్ భగీరథ నీరు తాగకపోగా, కేవలం ఇతరాత్ర అవసరాలకు ఆ నీటిని ఉపయోగిస్తున్నారు.
సుమారు రెండు కిలోమీటర్ల కాలినడక..
ఎండుతున్న గొంతును తడుపుకోవాలం టే ఆ గ్రామంలో సుమారు రెండు కిలోమీటర్ల కాలినడకన వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. ఇంద్రవెల్లి మండలం తేజాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని సాలెగూడ గ్రామ గిరిజనులు తాగునీటి కోసం ప్రతి నిత్యం గ్రామ శివారులోని వ్యవసాయ బోర్ వద్ద కు సుమారు రెండు కిలోమీటర్ల మేర కాలినడకన వెళ్లాల్సి వస్తోంది.
గ్రామంలో 90 గిరిజన కుటుంబాలు ఉన్నపటికీ నీటి వ్యవస్థ సరిగ్గా లేదు. మిషన్ భగీరథ నీరు 15 రోజులకు ఒకసారి సరఫరా అవుతాయని గ్రామస్థులు పేర్కొన్నారు. గతంలో పంచాయతీ ఆధ్వర్యంలో గతంలో ఏర్పాటు చేసిన బోరు బావి వద్దకు ప్రతి నిత్యం సుమారు 2 కిలోమీటర్ల నేర నడిచి వెళ్లి నీటిని తీసుకొని వస్తామని వాపోయారు.
కాలినడక ఎడ్లబండే శరణ్యం..
జిల్లాలోని చాలా మేరకు ఏజెన్సీ గ్రామా ల్లో, మారుమూల పల్లెల్లో నేటికీ మంచినీటి కోసం కోసులమైళ్ళు కాలినడకన వెళ్లాల్సి వస్తోంది. గ్రామానికి చెందిన అడ, మగా,... చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఉదయాన్నే తలపై బిందెలను పెట్టుకొని మంచి నీటిని తెచ్చుకుంటున్న దృశ్యాలు కోకోళ్ళలుగా కనబడుతాయి. మరికొందరు ఎడ్ల బండిపై డ్రమ్ములను పెట్టుకొని నీటిని తెచ్చుకుంటారు. మంచినీటి ఇబ్బంది వేసవికాలంలో మరింతగా నెలకొంటుంది.
మిషన్ భగీరథపై అవగాహన లోపం..
గత రాష్ర్ట ప్రభుత్వం మారుమూల గ్రా మాల్లో నీటి సమస్యను తీర్చేందుకు మిషన్ భగీరథ పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. కానీ నేటికీ చాలా గ్రామాల్లో మిషన్ భగీరథ నీటి సరఫరా జరగకపోగా, సరఫరా జరిగిన కొన్ని గ్రామాల్లో సైతం మిషన్ భగీరథ నీటిని ప్రజలు తాగడం లేదు. మారుమూల గ్రామాల్లో నిరక్షరాస్యత ఎక్కువగా ఉండటంతో గ్రామీణ ప్రాంత ప్ర జలు మిషన్ భగీరథ నీటిని ఉపయోగించకపోగా గ్రామంలోని బోరుబావులు, వాగుల నీటిని మాత్రమే తాగడానికి ఉపయోగిస్తా రు.
దీంతో ఇప్పటికి పలు గ్రామాల్లో మంచి నీటి కటకట నెలకొంది. మిషన్ భగీరథ నీటిని తాగితే అనారోగ్యం పాలవుతామని అపోహతో చాలా గ్రామాల్లో నీటిని ఉపయోగించడం లేదు. ప్రజల్లో మిషన్ భగీరథ నీటిపై అధికారుల అవగాహన కొరవడింది.