అధికారుల ప్రతిపాదనలు
హనుమకొండ, అక్టోబర్ 6 (విజయక్రాంతి): వరంగల్ జిల్లా నర్సంపేట మండల ంలోని తొమ్మిది గ్రామాలను నర్సంపేట మున్సిపాలిటీలో విలీనం చేసేందుకు అధికారులకు ప్రతిపాదనలు పంపించినట్లు మున్సిపల్ కమిషనర్ ఈసంపల్లి జోనా వెల్లడించారు. ఈ మేరకు ఆయన మండల పరి షత్ అభివృద్ధి అధికారికి ప్రతిపాదన లేఖను అందించినట్లు తెలిపారు.
ప్రతిపాదిత మహేశ్వరం, రాజుపల్లి, మగ్ధంపురం, ముత్తోజిపేట, రాజుపేట, మాదన్నపేట, రాములునాయక్ తండా, పర్షనాయక్‌తండా, నాగూర్లపల్లి పంచాయతీల పూర్తి వివరాలను అందించాలని లేఖలో కోరారు. మున్సిపల్ కేంద్రాలకు ఆయా గ్రామాలకు మధ్య దూరం, జనాభా, ఉన్న ఓటర్లు, విస్తీర్ణం, పన్నుల ద్వారా వచ్చే ఆదాయం, గృహాల సంఖ్య తదితర పట్టికను పూర్తి చేసి సమర్పించాలని ఆయన కోరారు. గ్రామసభలలో చర్చించిన తర్వాతే పురపాలికలో విలీనం చేస్తారా లేదా అనేది తెలుస్తుందని ఆయన పేర్కొన్నారు.