calender_icon.png 13 February, 2025 | 12:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్ పాలనలో కుదేలైన గ్రామాలు

13-02-2025 01:12:42 AM

* అవినీతి, అక్రమాలను వెలికి తీస్తాం

* రేషన్ కార్డులు, ఇల్ల నిర్మాణాలకు  వేలాది దరఖాస్తులు

* గోపాల్‌పేట, రేవల్లి, ఏదుల  మండలాల పర్యటన

*  ఎమ్మెల్యే ఎమ్మెల్యే మేఘా రెడ్డి

రేవల్లి,  ఫిబ్రవరి 12: పదేళ్ల బి ఆర్ ఎస్ పాలనలో తెలంగాణ రాష్ర్టంలోని గ్రామాల న్నీ అవినీతితో కుశించి కుదేలయ్యాయనీ, ఉమ్మడి మండలంలో వారి 10 ఏండ్ల లో జరిగిన అవినీతిని అక్రమాలను వెలికి తీస్తా మని ఎమ్మెల్యే మేఘా రెడ్డి అన్నారు. 

బుధ వారం ఆయన గోపాల్పేట, రేవల్లి, ఏదుల మండలంలోని గ్రామాలలో విసృతంగా పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు, ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 10 ఏండ్ల బీఆర్‌ఎస్ పాలనలోని పాలకులు ప్రజలను పట్టించుకొక పోవడంతోనె నేడు గ్రామ గ్రామాన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, రేషన్ కార్డుల కోసం వేలాదిగా దరఖాస్తులు ఇస్తున్నారని నాటి బి ఆర్ ఎస్ ప్రభుత్వం ఇండ్లు రేషన్ కార్డులు మంజూరు చేసి ఉంటే ప్రజలు ఇంత ఇబ్బందులు పడేవారు కాదని ఆయన అన్నారు,నేటి ఇందిరమ్మ రాజ్యంలో  గ్రామ గ్రామాన ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు,   పూర్తిస్థాయిలో అంది స్తున్నామని ఆయన తెలిపారు.

గతంలో కం టే  ఎస్సీ కాలనీల బలోపేతానికి దానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద పీట వేసిందని అం దుకే కాంగ్రెస్ మంజూరు చేసిన నిధులకు సంబంధించిన అభివృద్ధి పనులకు తాను నేడు ప్రారంభాలు చేస్తున్నట్లు ఆయన తెలి పారు. ఇంటి నిర్మాణం చేపట్టే ప్రతి ఒక్కరూ బేస్మెట్ లెవెల్ లో ఉన్న ఫోటోలను ఆన్లున్లో అప్లోడ్ చేసిన నాలుగు, ఐదు రోజులు లక్ష రూపాయలు నిధులు వారి వారి ఖాతాలలో పారదర్శకంగా జమవుతాయని ఆయన తెలి పారు.

ఈ కార్యక్రమంలో  ఉమ్మడి మండల ఇన్చార్జ్ సత్య శీలా రెడ్డి, జయపాల్ రెడ్డి,పార్టీ మండల అధ్యక్షుడు  పర్వతాలు, జిల్లా సెల్ అధ్యక్షుడు కొంకి వెంకట్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వాకిటి ఆదిత్య, నాయకు లు తోకల బాల్ రెడ్డి, మిద్దె స్వామి, బాల స్వామి, సుబ్బా రెడ్డి, నాగం కరుణాకర్ రెడ్డి, సుల్తాన్ అలీ,నీలవర్ధన్,సిరిమల్లెశ్,గురునాథ్ రెడ్డి, సుధాకర్ యాదవ్, సురేష్ యాదవ్, చాకలి వెంకటయ్య ,వాడల వెంకటయ్య, ఎద్దుల కుర్మయ్య తదితరులు పాల్గొన్నారు,