calender_icon.png 19 September, 2024 | 10:04 PM

గ్రామాలే ప్రశాంతతకు పట్టుకొమ్మలు

09-09-2024 12:00:00 AM

  1. విదేశాల్లో ఉన్నా సొంతూరులో బతకాలనుకుంటున్న యువత 
  2. ఒత్తిడి లేని జీవితంవైపు మొగ్గుచూపుతున్న టెకీలు 
  3. పల్లెటూర్లలో ఉండేందుకు ఆసక్తి 
  4. వీకెండ్స్‌లో విలేజీ టూర్లకు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: యువత తన జీవిత శైలిపై ఎప్పుడూ నిర్దిష్టంగా ఉండలేరు. రెండు దశాబ్దాల కాలంలో విదేశాలకు వెళ్లి అక్కడే స్థిరపడాలనే దృఢ నిశ్చయంతో ఉన్నారు. కానీ, ప్రపంచం వేగంగా మారిపోతోంది. అంతటా అవకాశాలు లభిస్తున్న నేపథ్యంలో ఇంటి దగ్గ రే ఉండాలని ఆలోచిస్తున్నారు. వాతావరణ కాలుష్యం కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తోంది. పట్టణాలు లేదా నగరాల్లో ఉంటే వాయు కాలుష్యానికి గురికాక తప్పదు. దీంతో యువత ప్రశాంతమైన పల్లె వాతావరణంలో జీవించేందుకు మొగ్గు చూపుతున్నారు.

ఉరుకులపరుగుల జీవితాలకు దూరంగా ప్రశాంతమైన జీవనాన్ని గడిపేందుకు పల్లెల్లో ముఖ్యంగా సొంతూరులో ఉండేందుకు ఇష్టపడుతున్నారు. ఉదాహరణకు సైకాజిసిస్టు పూజా వేగెశ్న ఏపీలోని తన పూర్వీకుల ఇంటికి మారారు. తన నానమ్మ, తాతయ్య జీవితం ఎలా గడిచిందో దానిపై డాక్యుమెంటరీ తీయాలని భావించారు. వాళ్ల జీవిత ప్రయాణాన్ని తెరకెక్కించారు.

సందడిగా, ఉరుకులపరుగుల జీవితానికి దూరంగా సాదాసీ దాగా గడిచిన వారి జీవితంపై ఆమెకూ ఆసక్తి పెరిగింది. ప్రకృతితో మమేకమవుతూ ఆధ్యాత్మికంగా జీవించడం పట్ల వేగెశ్నకు ఆసక్తి పెరిగింది. ఇప్పుడూ తన నానమ్మ, తాతయ్య జీవిత శైలిని అనుకరించేందుకు ఆమె ప్రయత్నిస్తోంది. పూజ ఒక్కరే ఇందుకు ఉదాహరణ కాదు. చాలా మంది మెట్రో జీవితానికి దూరంగా బతకాలని కోరుకుంటున్నారు. సోషల్ మీడియా, ఫ్యాషన్, ట్రావెల్‌లో ఇలాంటి మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. 

ఓ టెకీ కథ

దేశంలో వారానికి 70 గంటలు కష్టపడేందుకు సైతం యువత ఇష్టపడుతున్నారు. కానీ రోజుకు 5 గంటలు కష్టపడి మిగతా జీవితం సోషల్‌గా వినియోగించాలని ఎక్కువమంది కోరుకుంటున్నారు. వారంతా సొంతూరు లేదా పల్లెటూర్లలో స్థిరపడాలని భావిస్తున్నారు. నెమ్మదిగా సాగే స్థిరమైన జీవనంలో అడుగుపెట్టాలని కోరుకుంటున్నారు. కానీ ఇందులో ఇబ్బందులు లేకపోలేదు. సమాజం మనల్ని ఎలా చూస్తుందన్న విషయంలో పలువురు ఆందోళన చెందుతున్నారు. అందుకే కోరిక ఉన్నా ఆ దిశగా ఆలోచించడంలేదు.

భారత్‌కు చెందిక బిలియనీర్, టెక్ కంపెనీ జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు ఇందు కు ఓ చక్కటి ఉదాహరణ. 2019లో అమెరికాలో ఉన్నత ఉద్యోగాన్ని వదిలి తమిళనాడు లోని తెన్‌కాశి జిల్లాలోని ఓ గ్రామానికి మకాం మార్చాడు. నగరాలను కాదని మఠలంపరై గ్రామంలోని ఫ్యాక్టరీని తన కార్యాలయంగా మార్చుకున్నాడు. 2022 నాటికి జోహో కార్పొరేషన్ ఆదాయం రూ.8,300 కోట్లను అధిగమించింది. ఇంత విజయవంతంగా ఓ టెక్ కంపెనీని నడుపుతున్న శ్రీధర్ గ్రామంలో ప్రశాంత జీవనాన్ని గడుపుతున్నాడు. 

గ్రామీణంలోనే ప్రశాంత జీవనం

ప్రజల కోరుకునే జీవనశైలి ఎంపికలో ఎంతో మార్పు వచ్చింది. వేగవంతమైన ప్రయాణం, ఒత్తిడితో కూడిన జీవితం నుంచి ప్రజలు నెమ్మదిగా పక్కకు తప్పుకుంటున్నారు అని సైకాలజిస్ట్ ఆష్మీన్ ముంజాల్ అంటున్నారు. ఈ మార్పునకు ప్రధాన కారణం ఆధునిక జీవితంలో స్థిరత్వం లేకపోవం, పని ఒత్తిడి నుంచి దూరంగా ఉండాలని ఎక్కువ మంది భావిస్తున్నారు. దీంతో పాటు కొవిడ్ తర్వాత అనేక మార్పు లు సంభవించాయి. చాలా మంది ఇంటి నుంచే పనిచేయడం ప్రారంభించారు.

ఇది పనిపరంగా, వ్యక్తిగతంగా ఎక్కువ ఫలితాన్ని రాబట్టిందని చెప్పవచ్చు. దీంతో చాలా మంది డిజిటల్ సంచార జాతులుగా మారినట్లు చెప్పవచ్చు. టూరిజం విషయానికి వచ్చి  నా పల్లెటూర్లకు నగరవాసులు పోటెత్తుతున్నారు. అక్కడి ఆహ్లాదకర వాతావరణాన్ని అనుభూతి పొందేందుకు వారానికో టూర్ వేస్తున్నారు. యూట్యూబర్లు సైతం తమ తమ గ్రామాల్లో విశిష్టతల గురించి చెప్పడంతో టెకీలు వీకెండ్స్‌లో గ్రామాల బాట పడుతున్నారు.