calender_icon.png 5 April, 2025 | 6:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గంజాయి సరఫరా అరికట్టాలని గ్రామస్థుల

02-04-2025 01:01:06 AM

నాగర్ కర్నూల్ ఏప్రిల్ 1 (విజయక్రాంతి) తమ గ్రామంలో విచ్చలవిడిగా గంజాయి సరఫరా జరుగుతోందని ఫలితాంగా యువత పిచ్చిగా ప్రవర్తిస్తున్నారని గంజాయి సరఫరా నిలిపివేయాలని కోరుతూ మంగళవారం తాడూరు మండలం భల్లాన్ పల్లి గ్రామస్తులు సీఐ కనకయ్యకు ఫిర్యాదు చేశారు. 

కొంతమంది యువకులు గంజాయికి అలవాటు పడి కిరాణం షాపులలో సిగరెట్లు కొనుగోలు చేసి వాటిలో గంజాయిని నింపుకుని స్మశాన వాటిక, బహిరంగ ప్రదేశాలలో సేవిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. గంజాయి సేవించిన యువత పిచ్చిగా ప్రవర్తిస్తూ అనేక దాడులకు దిగుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.  ఇదే విషయంపై పోలీసులకు పలుమార్లు విన్నవించిన పట్టించుకోలేదని ఆరోపించారు.