calender_icon.png 25 April, 2025 | 8:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తాగునీటి కోసం రోడ్డెక్కిన గ్రామస్తులు

25-04-2025 04:13:45 PM

కామారెడ్డి జిల్లా పిట్లంలో ఆందోళన చేసిన గ్రామస్తులు...

కామారెడ్డి (విజయక్రాంతి): తాగునీటి సమస్య పరిష్కరించాలని కామారెడ్డి జిల్లా(Kamareddy District) పిట్లం మండలంలోని తిమ్మనగర్ గ్రామంలో గ్రామస్తులు శుక్రవారం రోడ్డెక్కి రాస్తారోకో చేశారు. నీటి ఎద్దడిపై ఎన్ని పర్యాయాలు అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోకపోవడంతో రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడిందని గ్రామస్తులు పేర్కొన్నారు. గంటకు పైగా రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అప్పటికి స్పందించిన గ్రామ పంచాయతీ సెక్రటరీ వచ్చి గ్రామస్తులపై దురుసుగా ప్రవర్తించడంతో కొంత ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. సెక్రటరీని ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి మా సమస్యను పరిష్కరించాలని గ్రామస్థులు నిలదీశారు. నీటి సమస్య ఏర్పడానికి సెక్రెటరీ ని నువ్వే కారణం అని సెక్రటరీ పై మండిపడ్డారు. ఎన్ని పర్యాయాలు కార్యాలయం చుట్టూ తిరిగినప్పటికీ సకాలంలో సెక్రటరీ ఉండకపోవడంతో సమస్య ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఇలా రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశామని గ్రామస్తులు తెలిపారు.