calender_icon.png 20 March, 2025 | 5:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని గ్రామస్తుల ధర్నా

16-12-2024 11:31:12 PM

ప్రభుత్వం ఇచ్చిన హమీలను అమలు చేయాలని వేడుకోలు

కామారెడ్డి (విజయక్రాంతి): కొత్త పెన్షన్లను ప్రభుత్వం మంజూరు చేయాలని కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని పోతంగల్‌లో గ్రామస్తులు సోమవారం ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి హమీ ఇచ్చారని ఇప్పటి వరకు ఏడాది అవుతున్న కొత్త పెన్షన్లు మంజూరు చేయలేదని గ్రామస్తులు వాపోయారు. ప్రభుత్వం ఇచ్చిన హమీ మేరకు కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని వేడుకొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచిన కొత్త పెన్షన్లు మంజూరు చేయకపోవడం విచారకరమన్నారు. ఇచ్చిన హమీ మేరకు మహిళలకు రూ.2500 భృతి అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోతంగల్ గ్రామస్తులు రమేశ్, శంకర్, పండరి, రాములు తదితరులు పాల్గొన్నారు.