10 June, 2026 | 5:54 AM

నాగర్కర్నూల్లో కలపాలని దీక్షకు అనుమతి కోరిన గ్రామస్థులు

10-06-2026 12:57 AM

రేవల్లి, జూన్ 9: వనపర్తి జిల్లా పరిధిలోని తల్పునూర్ గ్రామాన్ని నాగర్కర్నూల్ జిల్లాలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్థులు ఉద్యమబాట పట్టారు. తమ సుదీర్ఘ డిమాండ్ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు శాంతియుత మార్గంలో నిరసన దీక్ష చేపట్టేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ మంగళవారం రేవల్లి ఎస్‌ఐ రజితకి గ్రామస్థులు వినతిపత్రం సమర్పించారు.

ఎలాంటి శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చట్టప్రకారం దీక్ష కొనసాగిస్తామని  పేర్కొన్నారు. వినతిపత్రం సమర్పించిన వారిలో గ్రామస్తులు జి. ఉత్తంరెడ్డి, ఉప్పరి సాయి, ఎల్లాల లక్ష్మయ్య, ఎస్.డి. ఆసిఫ్, బాబురావు, మేడిగంటి భీముడు, కొడిపల్లి రాము, పిట్టల బాలస్వామి, కంపిళ్ళ నర్సయ్య, బిజ్జల రాములు మరియు గ్రామ యువకులున్నారు. నిరసనకు అనుమతి ఇవ్వాలని ఎస్‌ఐ రజితకు వినతి పత్రం అందిస్తున్న తల్పునూర్ గ్రామస్తులు