20-03-2025 05:19:19 PM
బిచ్కుంద (విజయక్రాంతి): గ్రామాన్ని మున్సిపల్ లో కలపవద్దని గోపన్పల్లి గ్రామస్తులు ధర్నా రాస్తారోకో నిర్వహించారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో కొత్తగా ఏర్పాటవుతున్న బిచ్కుంద మున్సిపాలిటీల్లో గోపాన్ పల్లి గ్రామాన్ని కల్పవద్దని గ్రామస్తులు గురువారం ఆందోళన నిర్వహించారు. మున్సిపల్ పరిధిలో కలిపితే అభివృద్ధి జరగదని టాక్స్ లు పెరుగుతాయని గ్రామస్తులు ఆరోపించారు. బిచ్కుంద మున్సిపాలిటీలో గోపాన్ పల్లి గ్రామాన్ని కలుప వద్దని గ్రామస్తులు నిరసన తెలిపారు. బిచ్కుంద మున్సిపాలిటీగా మారితే అందులో గోపన్ పల్లి గ్రామాన్ని కలుప వద్దని గ్రామస్తులు కోరుతున్నారు.
ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ... మున్సిపాలిటీలో తమ గ్రామం చేరితే ఎలాంటి ఉపాధి లభించదని, గ్రామపంచాయతీ ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పని రద్దవుతుందని, ఇంటి పన్నులు విపరీతంగా పెరుగుతాయని అన్నారు. అందువల్ల మాకు మున్సిపాలిటీ వద్దని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం బిచ్కుంద తహశీల్దార్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. మున్సిపాలిటీ వద్దు గ్రామమే ముద్దు అంటూ నినాదాలు చేశారు. గ్రామ ప్రజలందరూ కలెక్టర్, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్లి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.