09-03-2025 10:20:27 AM
భూపాలపల్లి,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం లక్ష్మారెడ్డి పల్లిలో శ్రీ రామలింగేశ్వర అభయాంజనేయ స్వామి దేవాలయంలో త్రివర్ణ ప్రతాక రూపంలో అలంకరించి స్వామివారికి గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నేడు దుబాయ్ వేదికగా జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ పైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ పై భారత క్రికెట్ జట్టు గెలవాలని కాంక్షిస్తూ ప్రత్యేక గ్రామస్తులు,యువకులు ప్రత్యేక పూజలు జరిపారు.
న్యూజిలాండ్ తో జరిగే పోరులో భారత క్రికెట్ జట్టు భారీ విజయం సాధించి భారత దేశ కీర్తి కిరీటంలో మరొక మైలు రాయిని చేర్చాలని మనస్ఫూర్తిగా కోరారు.భారత్ విజయం సాధించాలని క్రికెట్ అభిమానులు సైతం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.ఆటను ఆసక్తిగా తిలకించడానికి అభిమానులు ఉవ్విల్లూరుతున్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు బలబత్తుల రాజ్ కుమార్,గ్రామ మాజీ సర్పంచ్ ఓద్దుల విజయ అశోక రెడ్డి, మామిడాల విజయ్,వీరగోని నాగరాజ్,పున్నం భాస్కర్ రెడ్డి,సాదు చంద్రయ్య,వీరమల్ల శ్రీశాంత్ రెడ్డి,ఎడ్ల. సంతోష్,విద్వత్,మేడిపల్లి సాత్విక్,శ్రావ్య,పెండ్యాల వినయ్,రిషి వర్ధన్,బొక్క గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.