calender_icon.png 24 December, 2024 | 1:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దుర్గామాత విగ్రహ దాతలకు గ్రామస్తుల ఘన సన్మానం

13-10-2024 12:57:39 PM

బెల్లంపల్లి, (విజయక్రాంతి): బెల్లంపల్లి మండలంలోని చాకేపల్లి గ్రామంలో దుర్గామాత విగ్రహ దాతలు గుజ్జ మమత, సతీష్ దంపతులను ఆదివారం గ్రామస్తులు నూతన వస్త్రాలు సమర్పించి ఘనంగా సన్మానించారు. శరన్నవరాత్రుల్లో భాగంగా తొమ్మిది రోజులు గ్రామంలో ప్రత్యేక పూజలు చేయించడంలో దంపతులు చేసిన కృషిని వారు అభినందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చిన మాజీ ఎంపిటిసి ముడి మడుగుల మహేందర్ మాట్లాడుతూ.. పదేళ్లుగా గ్రామంలో దుర్గామాత అమ్మవారిని ప్రతిష్టించడం వల్ల గ్రామానికి చాలా మంచి జరుగుతుందన్నారు. పంటలు సక్రమంగా పొందడంతో పాటు ఎంతో మంది యువకులకు ఉద్యోగాలు లభించాయని చెప్పారు. దంపతులు గుజ్జ మమత, సతీష్ లను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో దుర్గామాత ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.