calender_icon.png 15 April, 2025 | 6:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెరువు మట్టి తరలింపును అడ్డుకున్న గ్రామస్తులు

12-04-2025 10:06:51 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం నాంచారి మనూరు గ్రామంలోని చెరువు నుంచి అక్రమంగా మట్టి తరలిస్తున్నారని ఆరోపిస్తూ గ్రామస్తులు మట్టి తరలించే టిప్పర్లను అడ్డుకున్నారు. గ్రామస్తుల ప్రమేయం లేకుండానే ఇటుక బట్టీలకు మట్టి తరలించేందుకు అధికారులు అనుమతులు ఇచ్చారని, వెంటనే అనుమతులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. చెరువు మట్టి తరలించేందుకు వినియోగిస్తున్న ఒక జేసిబీ, నాలుగు టిప్పర్లను గ్రామస్తులు అడ్డుకున్నారు.