calender_icon.png 7 January, 2025 | 3:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అటవీ అధికారులపై గ్రామసు ్థల దాడి

06-01-2025 12:05:02 AM

  • తనిఖీకి వచ్చినందుకు రాళ్లవాన, కర్రలతో అటాక్
  • ఆదిలాబాద్ జిల్లా కేశవపట్నంలో ఉద్రిక్తత

ఆదిలాబాద్, జనవరి 5 (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం కేశవపట్నంలో అటవీ శాఖ అధికారులపై గ్రామ  దాడి చేయడం ఉద్రిక్తతకు దారి తీసిం  అక్రమంగా కలపను నిల ఉంచారనే సమాచారంతో అటవీ శాఖ అధికారులు ఆదివారం గ్రామంలో తనిఖీలు నిరహించేందుకు వెళ్లారు. దీంతో కొంతమంది గ్రామస్థులు అధికారులను చుట్టుముట్టారు.

ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరగడంతో గ్రామస్థులు రాళ్లు రువడంతో పాటు కర్రలతో దాడి చేశారు. అటవీశాఖ అధికారులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు చేరుకుని గ్రామస్థులను చెదరగొట్టారు.

ఈ దాడిలో ఎఫ్‌ఎస్‌వో భూమన్న, ఎఫ్‌బీవో నౌశిలాల్, అనిల్, వాచర్ పాండురంగ, డ్రైవర్ ముకుంద్‌లకు గాయాల  రెండు వాహనాలు ధంసం అయ్యా  ఘటన అనంతరం ఇచ్చోడ ఎఫ్‌డీవో రేవంత్‌చంద్ర మాట్లాడుతూ.. గత రెండు రోజుల క్రితం అక్రమంగా కలపను తరలిస్తున్న ఒకరిని పట్టుకున్నామన్నారు. ఆయన ఇచ్చిన సమాచారం మేరకు 20 మంది కేశవ్‌పట్నానికి చెందినవారు కలప దందా చేస్తున్నారని తెలిసి, తనిఖీ నిరహిస్తుండగా తమ సిబ్బందిపై దాడి చేశారని తెలిపారు.