calender_icon.png 11 February, 2025 | 10:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీటి ఎద్దడిపై గ్రామస్తుల ఆగ్రహం

11-02-2025 06:19:37 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి నియోజకవర్గంలోని కన్నెపల్లి మండలంలో గల సుర్జాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని జంగపల్లి గ్రామంలో తలెత్తిన తీవ్ర నీటిఎద్దడిపై గ్రామస్తులు మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. గత మూడు నెలలుగా తమ గ్రామంలో త్రాగునీటికి ఇక్కట్లు ఎదుర్కొంటున్నామని వారు ఆరోపించారు. గ్రామ పంచాయతీ కార్యదర్శికి త్రాగునీటి ఎద్దడిపై అనేకసార్లు ఫోన్ చేసినప్పటికీ పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు. నీటిఎద్దడి సమస్య తీవ్రంగా మారడంతో ప్రైవేటుగా ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేయాల్సిన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత ఉన్నతాధికారులు తమ గ్రామంలో త్రాగునీటి ఎద్దడి తీర్చేలా చర్యలు చేపట్టాలని వేడుకుంటున్నారు.