24 May, 2026 | 1:24 PM

పంట వ్యర్థాల దగ్ధంతో ఆందోళనలో పల్లె ప్రజలు

24-05-2026 12:06 PM

ఎప్పుడు ఎటు వైపు నుంచి అగ్ని కీలలు దూసుకు వస్తాయో నని భయం

బోథ్,(విజయక్రాంతి): మండలంలో ఈ ఏడాది రబీ పంట సాగు అధికంగా ఉండడంతో పంట వ్యర్ధాలు చేలలో నిండిపోయాయి. దీంతో రైతులు పంట వ్యర్థాలను తమ తమ పొలాలలో దగ్ధం చేస్తున్నారు. అయితే దగ్ధం చేస్తున్న సమయంలో గాలి వేస్తుండడంతో పక్కచేలకు అగ్ని కీలలు వ్యాపిస్తున్నాయి. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో జనం భయం భయంగా జీవిస్తున్నారు. తప్పిన పెను ప్రమాదాలు నేరడిగొండ మండలంలోని కుమారి బోత్ మండలంలోని కనుగుట్ట దన్నూర్ గ్రామాలలో పంట వ్యర్థాల మూలంగా రైతులకు భారీ నష్టం సంభవించింది.

కుమారి గ్రామస్తులు సకాలంలో స్పందించకపోతే గ్రామంలోని కొన్ని కాలిపోయేవని గ్రామస్తులంటున్నారు. కనుగుట్ట గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 48 ఎకరాల్లో పంట కానీ బూడిద కాగా కష్టపడి పంటను పండించిన రైతుల ఇళ్లలో విషాదం నెలకొంది. ప్రభుత్వం ఆదుకుంటామన్న భరోసా ఇచ్చిన ఎప్పటి వరకు నెరవేరుస్తారో తెలియకపోగా రైతు కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. బాధ్యత కుటుంబాల్లో తీరని బాధను నింపిన అగ్ని ప్రమాదాలు  అక్కడక్కడ జరుగుతూనే ఉన్నాయి. నేరడిగొండ మండలంలోని కుమారి గ్రామంలో శనివారం నాడు జరిగిన సంఘటన రెండవసారి అని గ్రామస్తులంటున్నారు.

శనివారం రాత్రి బోత్ మండలంలోని ధనుర్ గ్రామం పరిసరాలలో ఉన్న పొలాలలో పంట వ్యర్థాలను దగ్ధం చేయడం అదే సమయంలో ఈదురుగాలని రావటంతో గ్రామంలోని రైతుల్లో ఆందోళన నెలపొంది. దీంతో రైతులు ముందస్తుగా స్పందించారు. విక్రయానికి సిద్ధంగా ఉంచిన జొన్న పంట కుప్పల సమీపంలోకి అగ్ని కీలలు రాకముందే నేలనంత శుభ్రం చేసి నీళ్లు పట్టించారు. దీంతో అగ్ని ప్రమాదం జరగకుండా ఆగిపోయింది. ఇప్పుడేం జరుగుతుందో అటవీ సమీప గ్రామాల్లో ఉన్న ప్రజలు అయితే రాత్రిపూట కంటిమీద కునుకు లేకుండా ఉంటున్నారు.

ఆకస్మికంగా అడవుల్లో రాసుకునే మంటలు రాత్రికి రాత్రి గ్రామాలను చుట్టూ ఉంటే ఆస్కారం ఉండటం వల్ల అటవీ సమీప గ్రామాల గిరిజనులు రాత్రిపూట కాపలాగా ఉంటున్నారు. అడవుల్లో అగ్ని ప్రమాదం సంభవించిన వెంటనే తమ గ్రామాల సమీపంలో కి రాకుండా మంటలను ఆర్పి వేస్తున్నారు. మరోవైపు అటవీశాఖ అధికారులు సైతం అడవుల్లో అగ్ని ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టడంతో కొంతమేరకు అగ్ని ప్రమాదాలు జరగకుండా ఉంటున్నాయని అంటున్నారు.

అగ్ని ప్రమాదాల నివారణపై గ్రామస్తు లు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అధికారులు అంటున్నారు. పంట వ్యర్థాల దగ్ధంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఈ ఏడాది ఎక్కువ శాతం ఇటువంటి ప్రమాదాలను ఆపేందుకే తమ సమయం సరిపోతుందని అగ్నిమాపక శాఖ అధికారులు అంటున్నారు. చిన్నపాటి నిర్లక్ష్యం వల్ల కోట్ల రూపాయల ఆస్తి బుగ్గిపాలఅవుతున్నది. వేసవికాలం ముగిసినంతవరకు జనం జాగ్రత్తగా ఉండాల్సిందేనని పరిశీలన అంటున్నారు.