నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలోని వివిధ గ్రామపంచాయతీలో సుదీర్ఘ కాలంగా విధులు నిర్వహిస్తున్న గ్రామ కార్యదర్శులను వారి విజ్ఞప్తి మేరకు వేరే మండలాలకు బదిలీ చేయాలని కోరుతూ సోమవారం సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్, డిపిఓ శ్రీనివాస్ కలిసి విన్నవించారు. ఎన్నో సంవత్సరాలుగా ఒకే ప్రదేశంలో విధులు నిర్వహించడం వల్ల ఇబ్బందులు ఏర్పడుతున్నాయని అధికారులు జోక్యం చేసుకొని బదిలీ కోరిన వారికి అవకాశం కల్పించాలని కలెక్టర్కు విన్నవించినట్లు ఆ సంఘం నాయకులు తెలిపారు.