టేకులపల్లిలో పలువురిపై కేసు
హైదరాబాద్, జనవరి 24 (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల లబ్ధిదారుల ఎం కోసం నిర్వహించిన గ్రామసభలు శుక్రవారంతో ముగిశాయి. రాష్ట్రవ్యాప్తంగా నా రోజుల్లో 16,348 గ్రామ/వార్డు సభలు జరిగాయి. ఈ నాలుగు పథకాలకు దరఖాస్తు చేసుకునేందుకు లబ్ధిదారులు పెద్దఎత్తున హాజరయ్యారు.
నిర్మల్ జిల్లాలో..
నిర్మల్, జనవరి 24 (విజయక్రాంతి)/ఇల్లెందు: నిర్మల్ జిల్లాలోని వివిధ గ్రామాల్లో శుక్రవారం నిర్వహించిన గ్రామసభల్లో ప్రజ ఆందోళనలు చేశారు. కడెం మం పెద్దుగ్రామం, నర్సాపూర్ మండల కేంద్రం, నిర్మల్ మండలం చిట్యాల్ అనంతపేట్, కుబీర్ మండల కేంద్రం, లోకేశ్వర్, దిలువార్‌పూర్, కుంటాల మండలంలోని కల్లూర్ గ్రామాల్లో అధికారులను నిదీశారు. పెద్దుర్‌లో అధికారులతో వాగ్వాదానికి దిగారు.
నర్సాపూర్ మండల కేంద్రంలో అధికార పార్టీ నేతలు అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల కేంద్రంలో జరిగిన గ్రామసభలో రసాభసా జరిగింది. మొదట ఎమ్మెల్యే కోరం కనకయ్య ప్రసంగిస్తుండగా కొందరు అడ్డుకున్నారు. అనంతరం అక్కడే కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసి ఎమ్మెల్యే వెళ్లిపోయారు. అనంతరం లబ్ధిదారుల పేర్లు చదువుతుండగా అనర్హులకు వచ్చాయంటూ కొందరు గొడవ చేశారు.
దీంతో తన విధులకు ఆటంకపరిచి దుర్బాషలాడి, భౌతికదాడికి పాల్పడ్డారని టేకులపల్లి పంచాయతీ కార్యదర్శి ఉప్పు దీప్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామానికి చెందిన ఆమెడ రేణుక, అజ్మిర భారతి, గుడిపూడి సత్యనారాయణతో పాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
మందు విందుతో అధికారుల ఎంజాయ్!
ఆదిలాబాద్(విజయక్రాంతి): గ్రామసభకు వెళ్లిన అధికారులు బీఆర్‌ఎస్ నేత ఇచ్చిన మందు దావత్‌లో పాల్గొన్నట్టు తెలిసింది. ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని సాంగ్డి గ్రామంలో శుక్రవారం గ్రామసభ నిరహించారు. మండల ప్రత్యేక అధికారి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్, ఎంపీడీవో మహేందర్, ఎంపీవో మహేశ్ గ్రామసభలో పాల్గొన్నారు. సభ ముగిసిన వెంటనే స్థానిక బీఆర్‌ఎస్ నాయకుడు, మాజీ సర్పంచ్ తనయుడు గ్రామ శివారులోని పంట పొలాల్లో దావత్ ఏర్పాటు చేశాడు.
దావత్‌లో మందు, విందుతో అధికారులు ఎంజాయ్ చేస్తున్న క్రమంలో స్థానిక యువకులు అక్కడికి చేరుకొని వీడియోలు తీశారు. గమనించిన అధికారులు పరుగులు తీశారు. ఓ రైతు విన్నపం మేరకు పంటను పరిశీలించేందుకు వెళ్లామని, దావత్‌కు తమకు ఎలాంటి సంబంధం లేదని అధికారులు పేర్కొనడం చెపుతున్నారు.