నాళేశ్వర్‌లో ఘనంగా ఊర పండుగ
గ్రామ ఆబివృద్ది కమిటి ఆధ్వర్యంలో ఘనంగా ఎర్పాట్లు
బోధన్: మే 24 (విజయక్రాంతి): నవిపేట్ మండలంలోని నాళేశ్వర్ గ్రామంలో ఊరపండుగను ఆదివారం ఘనంగా నిర్వహించారు. అమ్మవార్ల విగ్రహాలను కడాలతో ఊరేగింపూగా,డప్పు వాయిద్యాల మధ్య ఊరేగించి గంగాజలంతో అభిషేకం చేశారు. అనంతరం గ్రామదేవతలకు భక్తులు ప్రత్యేకపూజలు చేశారు. ఊరేగింపులో పోతరాజుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి.
అనంతరం గ్రామదేవతలకు బలిహరణ నిర్వహించారు.గ్రామస్థులు పేద్ద ఎత్తున పాల్గొని మొక్కలు తిర్చుకున్నారు ఈ సందర్బంగా సర్పంచ్ ఆర్ముర్ లావణ్య మట్లాడుతు నాళేశ్వర్ గ్రామంలో ఘనంగా ఏర్పాట్లు చేసి,అంగరంగా వైభవంగా ఎటవంటి ఇబ్బందులు కలుగకుండా ఊర పండుగను ఈ రోజు గ్రామ ఆబివృద్ది కమిటి, గ్రామ ప్రజల ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఉర పండుగలో బాగంగా గ్రామంలోని పాడి పశువలు,పడి పంటలు బాగా పండాలని,గ్రామస్తులు ఆంతా,ఆయురారోగ్యాలతో ఉండాలని,మొక్కలు చెల్లించుకోని గ్రామదేవతలకు ఖుషీ పండుగ నిర్వహించినట్లు తెలిపారు, ప్రతి మూడు సంవత్సరాల కు ఓక్కసారి ఊర పండుగను నిర్వహిస్తామని వీడీసీ సభ్యులు అన్నారు.ఈ కార్యక్రమం లో సర్పంచ్ ఆర్ముర్ లావణ్య,ఉప సర్పంచ్ ఆర్ముర్ శ్రీనివాస్,సోసైటి చైర్మన్ మగ్గరి హన్మండ్లు,గ్రామ పంచాయతీ పాలకవర్గం, మాజి సర్పంచ్ లు,మాజి యం.పి.టి.సి.లు,గ్రామస్థులు,తదితరులు పాల్గొన్నారు.






