calender_icon.png 29 April, 2025 | 12:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీసీ రోడ్డు నిర్మాణంతో గ్రామ అభివృద్ధి

28-04-2025 07:42:52 PM

గ్రామ శాఖ అధ్యక్షుడు గుండ గాని సుధాకర్ గౌడ్..

తుంగతుర్తి (విజయక్రాంతి): మండల పరిధిలోని తూర్పుగూడెం గ్రామంలో ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధులు రూ. 10 లక్షలతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను తూర్పుగూడెం గ్రామ శాఖ అధ్యక్షుడు గుండగాని సుధాకర్ గౌడ్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎన్ఆర్ఈజీఎస్ నిధులు మంజూరు చేసినందుకు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలుకు ధన్యవాదాలు తెలిపారు. సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని, పనుల్లో జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో గుండగాని మహేందర్, లింగంపల్లి హనుమంతు, గునిగంటి వెంకన్న, గుండగాని రమేష్, తాడూరి యాకన్న, గుండగాని లక్ష్మణ్, గుండగాని కన్నయ్య తదితరులు పాల్గొన్నారు