calender_icon.png 21 March, 2025 | 4:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ తోనే గ్రామాల అభివృద్ధి..

20-03-2025 05:02:45 PM

జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు..

బిచ్కుంద (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వంతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు. గురువారం కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో నూతన సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పేద ప్రజలకు అండగా కాంగ్రెస్ ఉంటుందని అన్నారు. కాంగ్రెస్ తోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గంగాధర్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మల్లికార్జున అప్ప, నాగనాథ్, విట్టల్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సాహెల్ సేటు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నాగనాథ్ పటేల్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మైనార్టీ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, పాషా సెట్, సంజు పటేల్, గౌస్ సెట్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.