calender_icon.png 11 February, 2025 | 11:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ హయాంలోనే గ్రామాల అభివృద్ధి

11-02-2025 12:25:29 AM

వనపర్తి, ఫిబ్రవరి 10 (విజయక్రాంతి): స్వాతంత్రం సిద్ధించిన నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలోనే గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందాయని, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపైనే కాంగ్రెస్ పార్టీ పూర్తి దృష్టి సారిస్తోందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి పేర్కొన్నారు. వనపర్తి జిల్లా ఖిల్లా ఘణపురం మండలంలోని పలు గ్రామాలలో  సి సి రోడ్లకు డ్రైనేజీల నిర్మాణాలకు బిటి రోడ్ల నిర్మాణాలకు ఆయన శంకుస్థాపనలు చేశారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి గ్రామం  అభివృద్ధి చెందాలని కాంగ్రెస్ ప్రభు త్వం ప్రత్యేక నిధులు కేటాయించి గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

కార్యక్రమంలో సోలిపురం రవీందర్ రెడ్డి, సాయి చరణ్ రెడ్డి, మురళీధర్ రెడ్డి, వెంకట్రావు, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వాకిటి ఆదిత్య, యూత్ కాంగ్రెస్ మండలా ధ్యక్షుడు నవీన్ రెడ్డి, శేఖర్ రెడ్డి, క్యామా రాజు, ఆగారం, ప్రకాష్, లక్ష్మారెడ్డి, రవి నాయక్, దామోద ర్ రెడ్డి, శ్యాంసుందర్ రెడ్డి, రాములు నాయక్, ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులుతదితరులు పాల్గొన్నారు.