17-04-2025 01:22:00 AM
నిజామాబాద్, ఏప్రిల్ 16 (విజయక్రాంతి): గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న గ్రామాల్లోని గ్రామ అభివృద్ధి కమిటీలు వెంటనే రద్దు చేయాలని సీపీఎం నాయకుడు పెద్ది వెంకటరామ్ కలెక్టర్ను కోరారు. ప్రజాప్రతినిధుల అండదండలతో వీడీసీ కమిటీలు రెచ్చిపోతున్నాయని ఆరోపించారు.
సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్ వెస్లీతోపాటు ప్రజాసంఘాల రాష్ట్ర బాధ్యులు, సీపీఎం జిల్లా కమిటీ ఈ నెల 12న ఎర్గట్ల మండలం, తాళ్లరాంపుర్ గ్రామాన్ని సందర్శించారని, 40 ఏళ్లుగా పెంచుకున్న ఈతవనాన్ని, తాటి వనాన్ని ఆ గ్రామ అభివృద్ధి కమిటీల కర్కషత్వానికి అగ్నికి ఆహుతయ్యాయని ఆరోపించారు.
చట్టబద్ధతలేని గ్రామ అభివృద్ధి కమిటీలను తక్షణమే రద్దు చేయాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ రమేశ్బాబు, నాయకులు నూర్జహాన్, రాములు, శేఖర్గౌడ్ పాల్గొన్నారు.