calender_icon.png 27 April, 2025 | 2:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిపిఐ బలోపేతం కోసమే గ్రామ శాఖల కమిటీలు

26-04-2025 08:26:40 PM

చిలుకూరు: సిపిఐ బలోపేతం కోసమే మండలంలో గ్రామ శాఖ కమిటీలు మహాసభలు జరుగుతున్నాయని ఆ మహాసభల్లో గ్రామాల వారీగా నూతన కమిటీలను ఎన్నుకోవడం జరుగుతుందని, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గన్న చంద్రశేఖర్, సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు అన్నారు. చిలుకూరు మండల కేంద్రంలో శనివారం. కె. ఏ,పి, ఫంక్షన్ హాల్ లో  చిలుకూరు గ్రామ శాఖ మహాసభ జరిగింది, ఈ మహాసభ సందర్భంగా పార్టీ జెండాను స్వతంత్ర సమరయోధులు సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గన్నా చంద్రశేఖర్, సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, మాట్లాడుతూ... రాబోయే స్థానిక సంస్థలను దృష్టిలో ఉంచుకొని కమిటీలను నూతనంగా ఏర్పాటు చేసినట్లు వారు అన్నారు. ఐదు గ్రామాల శాఖ మహాసభలు పూర్తి అయ్యాయని, వచ్చేనెల ఆరో తారీకు కల్లా మిగిలిన గ్రామ శాఖల మహాసభలు నిర్వహించి, అనంతరం మండల మహాసభ జరుపుతామని వారు తెలిపారు.

పాలకవర్గాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కింది స్థాయిలోని పేదలకు అందుతున్నాయా లేదా అని కమ్యూనిస్టు పార్టీ నాయకులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఆ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆవిర్భవించి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత ఏప్రిల్, నెల, మే, నెలలో జరగనున్న మండల జిల్లా రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయడానికి పార్టీ నాయకత్వం కార్యకర్తలు అహర్నిశలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం కొత్త చిలుకూరు పాత చిలుకూరు సంబంధించిన నూతన కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

కొత్త చిలుకూరు, పాత చిలుకూరు గ్రామ కార్యదర్శిగా, ఎస్ కే సాహెబ్ అలీ, చిలువేరు ఆంజనేయులు, సహాయ కార్యదర్శులుగా బాలే బోయిన  రవి, మల్లెపంగు ఉపేందర్ , పూల వాసు, మరియు 35 మంది కౌన్సిల్ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో గీత పనివాళ్ల సంఘం జిల్లా కార్యదర్శి కొండ కోటయ్య, రైతు సంఘం జిల్లా కార్యదర్శి దొడ్డ వెంకటయ్య, ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చేపూరి కొండలు, ముక్కా లక్ష్మీనారాయణ, కొడారు శ్రీనివాసరావు, మండవ అచ్చయ్య, సుల్తాన్ వెంకటేశ్వర్లు, సిరాపురపు శ్రీను, మాదారపు లక్ష్మయ్య, మాచర్ల వెంకటి, కడారు మధు, మండవ వెంకటి, మాదాసు మేరీ, కస్తూరి సైదులు, పుట్టపాక అంజయ్య, షేక్ హుస్సేన్, పోలే పోయిన గంగాధర్, వడ్డేపల్లి కోటేష్, కస్తూరి సత్యం, పిలుట్ల కనకయ్య, జిల్లా శ్రీను, మాదాసు ప్రశాంత్, మాదారపు కొండలు, అనంతుల రాము తదితరులు పాల్గొన్నారు.