calender_icon.png 20 April, 2025 | 4:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామగ్రామాన బీజేపీ ఆవిర్భావ వేడుకలు

08-04-2025 12:00:00 AM

మహబూబాబాద్, ఏప్రిల్ 7 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలో గ్రామ గ్రామాన సోమవారం భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. కేసముద్రం పట్టణంలో జ్యోతిబాపూలే సర్కిల్ వద్ద భాజపా పతాకాన్ని మండల పార్టీ అధ్యక్షుడు ఉప్పునూతల రమేష్ ఎగురవేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ అభివృద్ధి భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమని, ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుస్తోందని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో సైతం భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం తద్యమన్నారు.

వివిధ గ్రామాల్లో ఆయా గ్రామ పార్టీ అధ్యక్షులు పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు తుంపిల్ల శ్రీనివాస్, జిల్లా కోశాధికారి ఓలం శ్రీనివాస్, జిల్లా కౌన్సిల్ సభ్యుడు పొదిలా నరసింహారెడ్డి, రామడుగు వెంకట చారి, బోగోజు నాగేశ్వరరావు చారి, గాంధీ వెంకట్ రెడ్డి, మల్యాల రాములు, లెంకలపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

జనగామలో..

జనగామ, ఏప్రిల్ 7 (విజయక్రాంతి): జనగామ పట్టణంలోని 271, 272 బూత్‌లలో బీజేపీ జెండా పండుగను నిర్వహించారు. సోమవారం పార్టీ జిల్లా ప్రచార కార్యదర్శి పెద్దోజు జగదీశ్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించగా ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షుడు సౌడ రమేశ్ హాజరై జెండా ఎగురవేశారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు కీర్తి నర్సయ్య, ఫిల్మ్ సెన్సార్ బోర్డ్ మెంబర్ దండు శ్రీనివాస్, భాగాల నవీన్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు బొమ్మకంటి అనిల్, వి.వెంకటేష్, సందీప్, రవిరాజ్ కార్తీక్, తోకల హరీష్ , వంగల రవి, సురోజు హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.