calender_icon.png 24 January, 2025 | 4:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామ, వార్డుసభలను సద్వినియోగం చేసుకోవాలి

23-01-2025 12:17:50 AM

ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి 

గద్వాల, జనవరి 22 (విజయక్రాంతి): ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి పొందేందుకు అర్హులైన ప్రతి ఒక్కరు గ్రామ,వార్డు సభలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్  బి.యం సంతోష్ తెలిపారు.బుధవారం గద్వాల్ మున్సిపాలిటీ లోని వార్డు 27 లో   నిర్వహించిన ప్రజా పాలన వార్డు సభలో జిల్లా కలెక్టర్, స్థానిక శాసన సభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 26 నుండి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల అమలు చేయనుందని తెలిపారు. వార్డు సభలలో దరఖాస్తులు అందజేయవచ్చని, వీలుపడని వారు ఎప్పుడైనా మున్సిపల్ కార్యాలయాలలోని ప్రజా పాలన సేవా కేంద్రాలకు వెళ్లి సంబంధిత పత్రాలను జాతచేస్తూ దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించారు.

వచ్చిన ప్రతి దరఖాస్తును తప్పనిసరిగా పరిశీలించి అర్హులందరికీ సంక్షేమ పథకాలను వర్తింపజేస్తామని అన్నారు.  ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజల అభివృద్ధికి ఎంతో దోహదపడతాయని చెప్పారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు గ్రామ, వార్డు సభలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి  పేర్కొన్నారు.

లబ్ధిదారుల పేర్లు లిస్ట్లో రాకపోతే ఎటువంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని, గ్రామ, వార్డు సభలో మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని,సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి అధికారులు ఎప్పుడూ అందుబాటులో ఉంటారని తెలిపారు.అర్హులైన ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూర్చేందుకు తమ  కృషి చేస్తామన్నారు.

అదేవిధంగా గతంలో గత ప్రభుత్వ హయాంలో డబల్ బెడ్ రూమ్ లో డిప్పు  ద్వారా ఎంపికైన లబ్ధిదారులకు ఫిబ్రవరి నెలలో వారికి కూడా ప్రభుత్వం ఇండ్లను కేటాయించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమాలలో  అదనపు కలెక్టర్ నర్సింగ రావు,గద్వాల్ మున్సిపల్ కమిషనర్ దశరథ్,వార్డు కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు,్ర పజలు,తదితరులు పాల్గొన్నారు.