calender_icon.png 16 April, 2025 | 3:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విక్రమ్ రెడ్డి మృతి గ్రామానికి తీరని లోటు

14-04-2025 06:02:39 PM

ఘనంగా విక్రం రెడ్డి దశదినకర్మ..

హాజరైన వివిధ పార్టీ ముఖ్యులు..

తుంగతుర్తి: గాయం విక్రం రెడ్డి మరణంతో వెంపటి గ్రామం ఆత్మీయుడిని, మంచి నాయకున్ని కోల్పోయిందని, గ్రామానికి ఆయన చేసిన సేవలు మరువలేనివని వివిధ పార్టీల నాయకులు దీగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఇటీవల అనారోగ్యంతో మరణించిన  వెంపటి గ్రామ మాజీ సర్పంచ్, తిరుమలగిరి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ దాయం విక్రమ్ రెడ్డి దశదిన కార్యక్రమం సోమవారం మండల పరిధిలోని వెంపటి గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ పార్టీలకు చెందిన నాయకులు హాజరై విక్రమ్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సంతాప సభలో వారు మాట్లాడుతూ... గత 40 ఏండ్లుగా విక్రమ్ రెడ్డి తన గ్రామానికి ఎనలేని సేవలు అందించారని పేర్కొన్నారు. ఆయన వివిధ పార్టీల కొనసాగినప్పటికీ ఆయా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఇటు పార్టీ శ్రేణులు అటు ప్రజల గుండెల్లో ముద్ర వేసుకున్నారు అని అన్నారు.