calender_icon.png 17 January, 2025 | 1:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘాటిలో విక్రమ్ ప్రభు

16-01-2025 01:43:26 AM

అనుష్క శెట్టి గతంలో మాదిరిగా సినిమాలను వరుసబెట్టి చేయడం లేదు. ‘బాహుబలి’ తర్వాత నుంచి ఆమె చాలా జాగ్రత్తగా సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం అనుష్క ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘ఘాటి’. క్రిష్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ చిత్రం తెరకెక్కింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌తో బిజీగా ఉంది. ఇప్పటికే ఘాటి నుంచి కొన్ని అప్‌డేట్స్‌ను చిత్ర యూనిట్ వదిలింది.

బుధవారం ఈ సినిమాలో నటించే హీరోని అనౌన్స్ చేసి గ్లింప్స్ విడుదల చేశారు. హీరో విక్రమ్ ప్రభు ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాలో ఆయన దేశీ రాజు పాత్రలో నటిస్తున్నాడు. గ్లింప్స్ చూస్తుంటే దేశీ రాజు పాత్రకు సంబంధించిన యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ సినిమా ఏప్రిల్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.