calender_icon.png 8 January, 2025 | 8:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా సమస్యల పరిష్కారానికి వికాస్ నీతి

07-01-2025 12:55:44 AM

  1. యాప్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి
  2. ప్రణాళికా బద్ధంగా సమస్యలను పరిష్కరిస్తామని వెల్లడి

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 6 (విజయక్రాంతి): మల్కాజిగిరి అంటేనే సమస్యల వలయంగా ఉన్న సమయంలో తాను ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానని, తన నియోజకవర్గంలోని ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రణాళికా బద్ధంగా పరిష్కారం చూపబోతున్నానని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు.

సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారం కోసం ‘వికాస్ నీతి’ యాప్‌ను ఆవిష్కరించినట్టు చెప్పారు. ప్రతి సమస్యను ఒక్కొక్కటిగా ఉన్నతాధికారులు, సంబంధిత మంత్రులు, సీఎం దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు.

శాసనసభలో గిగ్ అండ్ ప్లాట్ ఫామ్ వర్కర్స్ సమస్యను ప్రస్తావించగా పరిష్కారం అయిందని, నార్త్ హైదరాబాద్ ప్రజలకు మెట్రో రైల్ ఆవశ్యకతను ప్రస్తావిస్తే  సీఎం సానుకూలంగా స్పందించి డీపీఆర్‌లు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారని పేర్కొన్నారు.

పేద బ్రాహ్మణ విద్యార్థుల ఓవర్సీస్ స్కాలర్‌షిప్ పంపిణీలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని ప్రస్తావించిన వెంటనే బ్రాహ్మణ పరిషత్‌కు వైస్‌చైర్‌పర్సన్‌గా శైలజ రామయ్యర్‌ను నియమించినట్టు చెప్పారు. ఎన్నికల సమయంలో ప్రజలు తన దృష్టికి తెచ్చిన ప్రధాన సమస్య అయిన ట్రాఫిక్ పరిష్కారం కోసం రైల్వే గేట్ల వద్ద ఆర్‌యూబీలు నిర్మించాలనే దృఢ సంకల్పంతో ఏడాది కాలంగా పక్కా ప్రణాళికతో అవసరమైన అన్ని అనుమతులు సంబంధిత శాఖల నుంచి తీసుకురావడంతో సక్సెస్ అయ్యానని చెప్పారు.

ప్రభుత్వం ప్రకటించిన ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల పంపిణీలో కూడా నిజమైన లబ్ధిదారులను గుర్తించి న్యాయం చేస్తామని స్పష్టంచేశారు.