calender_icon.png 13 March, 2025 | 9:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులు ప్రణాళిక బద్దంగా చదవాలి

13-03-2025 06:24:38 PM

వికారాబాద్ ఉమెన్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శివచంద్ర

చేగుంట,(విజయక్రాంతి): చేగుంట పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో  వికారాబాద్ ఉమెన్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శివచంద్ర(Vikarabad Women Police Station Circle Inspector Shiva Chandra) విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ...  విద్యార్థులు ప్రణాళిక బద్ధంగా చదివినట్లయితే, ఉన్నత శిఖరాలు ఎదుగుతారని, సమయం వృధా చేయడం ద్వారా భవిష్యత్తులో ఏమి సాధించలేరని, సమయాన్ని  సద్వినియోగం చేసుకొని  చదవడం, చదివిన దాన్ని పునఃశ్చరణ   చేయడం, వాటిని గుర్తుంచుకోవడం ద్వారా భవిష్యత్తులో వచ్చే పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారన్నారు. ప్రస్తుతం పదవుల్లో ఉన్న గొప్ప వ్యక్తులు ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాల చదువుకున్నారని, మీరు కూడా వారిని ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తులో గొప్ప వ్యక్తులు కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో చేగుంట ఎంఈఓ నీరజ, రఘుపతి, రాజేశ్వర్, సుధాకర్ రెడ్డి,  రాధా, రమా, రమాదేవి, శారదా, చల్లా లక్ష్మణ్, మనోహర్ రావు,  వెంకటేష్, సురేందర్, రేఖ, భవాని, సరస్వతి, శ్రీవాణి, ఉమా, ఉమామహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.