270 కి.మీ మేర నిర్మాణం
ఆమోదం తెలిపిన రైల్వే శాఖ
తాండూరు నుంచి జహీరాబాద్ రైల్వే లైన్‌కు సర్వే
సంగారెడ్డి, జూలై 5 (విజయక్రాంతి): వికారాబాద్-పర్లీ(మహారాష్ట్ర) వరకు డబుల్ రైల్వే లైన్ నిర్మాణానికి ప్రాథమిక సర్వే చేస్తున్నారు. వికారాబాద్ నుంచి పర్లీ వరకు 270 కిలోమీటర్లు డబుల్ లైన్ వేసేందుకు దక్షణ మధ్య రైల్వే బోర్డు ఆమోదం తెలిపి, పనులు చేసేందుకు ప్రతిపాదనాలు సిద్ధం చేస్తున్నది. కొత్తగా వేసే రైల్వే లైన్‌ను పాత రైల్వే లైన్ పక్క నుంచి వేసి, కొత్తగా బ్రిడ్జిలు నిర్మాణం చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. రైల్వే బడ్జెట్‌లో నిధులు మంజూరు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. డబుల్ లైన్ తో వికారాబాద్, గేట్ వనంపల్లి, మరుపల్లి, కోహీర్, జహీరాబాద్, మెటల్‌కుంట, బీదర్, బాల్కి, కమల్‌నగర్, ఉద్గిర్, లాత్తుర్ రోడ్డు, పర్లీ రైల్వే స్టేషన్‌లకు మేలు కలుగుతుంది.
ప్రతిరోజు 30 రైళ్ల రాకపోకలు
వికారాబాద్ మధ్య ప్రతీ రోజు 30 ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్, గూడ్స్ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. డబుల్ లైన్ ఏర్పాటు చేస్తే రైళ్ల సంఖ్య పెరిగే ఆవకాశం ఉందని రైల్వే అ ధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఈ మా ర్గాన్ని విద్యుత్తు సౌకర్యంతో రైలు నడించేందుకు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం గూడ్స్ రైళ్లే అధికంగా నడుస్తుండగా.. డబుల్ లైన్ నిర్మిం చి, రైల్వే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు స్టేషన్‌లను అధు నీకరిస్తున్నారు. అందుకు నిధులు కూడా మంజూరు కావడంతో పనులు వేగవంతంగా నడుస్తున్నాయి.
కొత్త రైలు మార్గంతో జహీరాబాద్ అభివృద్ధి
జహీరాబాద్‌లో జాతీయ పారిశ్రామీకరణ ఉత్పత్తి మండలి (నిమ్జ్) ఏర్పాటు కావడంతో రైల్వే లైన్ల నిర్మాణం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు ప్రతిపాదనాలు సిద్ధం చేస్తున్నాయి. కొత్తగా తాండురు నుంచి జహీరాబాద్‌కు రైల్వే లైన్ నిర్మాణం చేసేందుకు లొకేషన్ సర్వే చేస్తున్నారు. దీంతో జహీరాబాద్ మరింత అభివృద్ధి సాధించే ఆవకాశం ఉంది. తాండూరు మధ్య సిమెంట్ క్లస్టర్‌కు కొత్తగా రైల్వే లైన్ వేసేందుకు ఎఫ్‌ఎల్‌ఎప్ మంజూరు చేశారు. ప్రాజెక్టు ఖర్చు రూ.1,350 కోట్లుగా ప్రకటించారు. తాండూర్ మధ్య (వికా రాబాద్ మీదుగా) 65 కిల్లోమీటర్ల దూరం తగ్గించేందుకు కొత్త లైన్‌ను నిర్మించనున్నారు. తాండూర్ సిమెంట్ క్లస్టర్ నుంచి జహీరాబాద్‌కు రైలు మార్గం (75 కి.మీ.) ఏర్పాటుకు సర్వే చేస్తున్నారు. ఈ రైల్వే లైన్ పూర్తయితే వ్యవసాయం, వ్యాపారం, విద్య, పర్యాటకం, ఆరోగ్య సంరక్షణకు ఎంతో ఉపయోగపడుతుంది. తాండూరు సిమెంట్ పరి శ్రమల నుంచి సిమెంట్ బస్తాల రవాణాకు కొత్త రైలు మార్గం ఉపయోగపడుతుంది.
డబుల్ లైన్‌తో రైళ్ల సమస్య ఉండదు
వికారాబాద్ నుంచి వయా జహీరాబాద్ మీదగా పర్లీ వరకు డబుల్ లైన్ వేయడంతో రైళ్ల సంఖ్య పెరిగి ప్రయాణికులకు ఇబ్బందులు ఉండవు. సింగిల్ లైన్ ఉండడంతో ఎదురుగా రైలు వస్తే గంటల తరబడి రైలును నిలిపివేస్తున్నారు. డబుల్ లైన్ నిర్మాణం చేస్తే రైళ్లను నిలిపే అవసరం ఉండదు. డబుల్ లైన్‌తో జహీరాబాద్ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి సాధిస్తుంది. ఉమాకాంత్ పాటిల్, సీడీసీ మాజీ చైర్మన్, జహీరాబాద్
ప్రజలకు మేలు కలుగుతుంది
తాండూరు నుంచి జహీరాబాద్‌కు కొత్తగా రైల్వేలైన్ నిర్మాణం చేసేందుకు సర్వే చేయడంతో పాటు నిధులు మంజురు చేయడం సంతోషంగా ఉంది. తాండూరు వెళ్లేందుకు రైల్వే ప్రయాణికులు వికారాబాద్‌కు పోవాల్సిన పరిస్థితి ఉండదు. కొత్త లైన్ నిర్మాణం చేయడంతో 65 కిలో మీటర్ల దూరం తగ్గుతుంది.
రాములునేత, మాజీ కౌన్సిలర్ జహీరాబాద్