calender_icon.png 14 November, 2024 | 8:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విజయవాడ-శ్రీశైలం సీ ప్లేన్

09-11-2024 12:53:38 AM

పున్నమి ఘాట్ నుంచి నేడు ప్రారంభించనున్న ఏపీ సీఎం

నల్లగొండ, నవంబర్ 8 (విజయక్రాంతి) /శ్రీశైలం: ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ నంద్యాల జిల్లా శ్రీశైలం నడుమ సీ ప్లేన్ ప్రారంభం కానుంది. విజయవాడలో పున్నమి ఘాట్ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం సీ ప్లేన్‌ను ప్రారంభించి, అందులో శ్రీశైలం వరకు ప్రయాణించనున్నారు.

శుక్రవారం ఎన్డీఆర్‌ఎఫ్, పోలీసు, పర్యాటక, ఎయిర్‌ఫోర్స్ అధి కారుల పర్యవేక్షణలో సీ ప్లేన్ ట్రయల్ నిర్వహించగా విజయవంతంమైంది. విజయ వాడ ప్రకాశం బ్యారేజీ నుంచి బయల్దేరిన సీ ప్లేన్ శ్రీశైలం జలాశయంలో సురక్షితంగా దిగింది. అనంతరం శీశైలం పర్యాటక బోటింగ్ జట్టీ వరకు చేరుకుంది.

డీ హవిల్లాండ్ ఎయిర్ క్రాఫ్ట్ సంస్థ 14 సీట్లతో సీ ప్లేన్‌ను రూపొందించింది.  సీ ప్లేన్ సేవలు అందుబాటులోకి వస్తే విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న భక్తులు శ్రీశైల మల్లన్నను కూడా అదేరోజు దర్శించుకునేందుకు అవకాశం ఉంటుంది. ముఖ్యమంత్రి శ్రీశైలం పర్యటన నేపథ్యంలో పోలీసులు కట్టదిట్టమైన ఏర్పాట్లు చేశారు.