calender_icon.png 19 April, 2025 | 7:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విజయశాంతి రెండు గంటలపాటు బురదలోనే పడుకున్నారు!

15-04-2025 12:01:40 AM

నందమూరి కల్యాణ్‌రామ్ హీరోగా నటిస్తున్న తాజాచిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో అశోక్‌వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. ఈ యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో కొడుకు పాత్రలో కల్యాణ్‌రామ్ నటిస్తుండగా.. ఆయన తల్లిగా విజయ శాంతి కనిపించనున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 18న రిలీజ్ కానుంది.

ఈ సందర్భంగా డైరెక్టర్ ప్రదీప్ విలేకరులతో సినిమా విశేషాలను పంచుకున్నారు. “కల్యాణ్‌రామ్‌తో సినిమా చేయాలని తొలుత నిర్మాతలు అనుకున్నారు. ముందుగా మాస్ జోనర్‌లో హీరో క్యారెక్టర్ ను తయారుచేశా. తర్వాత వైజయంతి లాంటి శక్తిమంతమైన తల్లి పాత్ర అయితే బాగుంటుందనిపించింది. హీరో కు చెప్తే.. విజయశాంతి ఒప్పుకుంటేనే చేద్దాం.. అని స్పష్టంగా చెప్పేశారు. విజయశాంతికి కథ విని, చిన్న కరెక్షన్స్ చెప్పారు. తర్వాత సెట్స్‌పైకి తీసుకెళ్లాం. -తల్లిదండ్రులు మన బర్త్‌డేని ఒక సెలబ్రేషన్స్‌లా చేస్తారు.

వాళ్ల బర్త్‌డే మనం సెలబ్రేట్ చేయడం ఒక ఎమోషన్. అదే ఈ సినిమాలో చెప్పాలనుకున్నాను. హీరో క్యారెక్టర్, మదర్ క్యారెక్టర్ ఎవరి ఐడియాల జీలో వాళ్లు కరెక్ట్‌గా ఉంటారు. అక్కడ్నుంచే కాన్ ఫ్లిక్ట్ క్రియేట్ అవుతుంది. ఈ రెండూ పవర్‌ఫుల్ క్యారెక్టర్స్. ఫైట్లన్నీ అద్భుతంగా ఉంటాయి. నిజానికి విజయశాంతిని నేను ఇబ్బందిపెట్టాను. ఇందులో ఒక ఫారెస్ట్ సీక్వెన్స్ ఉంది. ఆ సీన్లో విజయశాంతి ఓ రెండు గంటల పాటు షాట్ పూర్తయ్యేవరకు అలాగే బురదలో పడుకున్నారు.

ఆ సీన్ ఫినిష్ చేసి కార్వాన్‌లోకి వెళ్లిన తర్వాత మేడమ్‌కు తీవ్రమైన జ్వరం వచ్చింది. చేయి వణుకుతుంది. అయినప్పటికీ సీన్ అయ్యేదాకా అక్కడ్నుంచి కదల్లేదు. ఆవిడ నటన చూసి చాలాసార్లు నాకు గూస్‌బంప్స్ వచ్చాయి. నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా సినిమా తీశారు. కల్యాణ్‌రామ్ ఎమోషన్‌ను అదరగొట్టేస్తారు. నా బలం కూడా -ఎమోషనే. నేను తర్వాత చేయబోయే సినిమాలు కూడా భావోద్వేగ ప్రధానంగానే ఉంటాయి.