calender_icon.png 10 March, 2025 | 5:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా విజయశాంతి నామినేషన్

10-03-2025 01:16:19 PM

హైదరాబాద్: కాంగ్రెస్, భారత రాష్ట్ర సమితి (Bharat Rashtra Samithi), కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (CPI) అభ్యర్థులు సోమవారం ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్లు(Telangana MLC polls ) దాఖలు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా విజయశాంతి(Vijayashanti ), అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ నామినేషన్లు దాఖలు చేశారు. సీపీఐ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం నామినేషన్ వేశారు. నామినేషన్ల దాఖలు కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఎమ్మెల్యే కోటా కింద తెలంగాణ శాసనమండలిలో ఖాళీగా ఉన్న ఐదు స్థానాలకు మార్చి 20న ఎన్నికలు జరుగుతాయి.