calender_icon.png 10 March, 2025 | 9:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎప్పుడూ ఏ పదవిని డిమాండ్ చేయలేదు: విజయశాంతి

10-03-2025 06:52:07 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి విజయశాంతి పార్టీ పట్ల తన నిబద్ధతను పునరుద్ఘాటించారు. ప్రభుత్వం మంచి ఉద్దేశ్యాలతో సంక్షేమ పథకాలను అమలు చేయడానికి అంకితభావంతో ఉందని పేర్కొన్నారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం విజయశాంతి మీడియాతో మాట్లాడుతూ... కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలను దశలవారీగా నెరవేరుస్తుందని చేప్పారు. కాంగ్రెస్ తో తనకున్న గత అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.తాను ఎప్పుడూ పార్టీలో పదవులు కోరుకోలేదని, ఎప్పుడూ ఏ పదవిని డిమాండ్ చేయకుండా పార్టీ కోసం పనిచేశానన్నారు. హైకమాండ్ తనకు పదవులు ఇచ్చినప్పటికీ నాకు వద్దు.. ముందుగా నా నిబద్ధతను నిరూపించుకోవాలని పట్టుబట్టేదనని ఆమె అన్నారు.

గతంలో బీఆర్ఎస్ మాజీ సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు తాను చేసిన ప్రయత్నాలను విజయశాంతి గుర్తుచేసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభ్యర్థన మేరకు తాను తిరిగి కాంగ్రెస్‌లో చేరానని పేర్కొన్నారు. పార్టీ సభ్యులలో సహనం ప్రాముఖ్యతను చెబుతూ హైకమాండ్ నిర్ణయాలు తీసుకుంటుందని, అవసరమైనప్పుడు ఎవరికి ఏ బాధ్యత ఇవ్వలనుకుంటుందో అదే ఇస్తుందన్నారు. పార్టీలోని ప్రతి ఒక్కరూ ఈ వ్యవస్థను గౌరవించాలని ఆమె వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో తన అంకితభావాన్ని విజయశాంతి ధృవీకరించారు. పార్టీ తనకు బాధ్యతను అప్పగించినప్పుడల్లా తను మాట్లాడతానని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారించడంపైనే దృష్టి ఉందని విజయశాంతి వెల్లడించారు.